Home రాజకీయాలు ప్రతి ఆంధ్రావాడి ఉసురు తగలడం వలనే మోడీకి పరాజయం !

ప్రతి ఆంధ్రావాడి ఉసురు తగలడం వలనే మోడీకి పరాజయం !

770
SHARE

ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసిన ఉసురు బీజేపీకి మోడీకి గట్టిగా తగులుతుందా ? దేశవ్యాప్తంగా మోడీ హవా పడిపోవడానికి ఇది శుభ సూచికమా ? త్వరలో బీజేపీ బట్టలను సర్దేసుకోవాల్సిందేనా ? ఇంతకీ ఏమి జరిగింది ? బీజేపీ ఎక్కడ ఓడిపోయింది ? వారి భవిష్యత్ ఎలా ఉండబోతుంది ?

బీజేపీ కి టఫ్ టైం మొదలైనట్లు కనిపిస్తుంది. రెండు నెలల క్రితం రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది బీజేపీ. ఒక ఎంపీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఏకంగా 2 లక్షలకు పైగా ఓట్లతో మట్టికరించింది. తాజాగా పంజాబ్ లో కూడా బీజేపీ ని కలవరపరిచేలా ఇదే ఎన్నికల్లో ఓడిపోయింది.

వీటిని బట్టి చూస్తుంటే దేశంలో బీజేపీ హవా తగ్గినట్లు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన అన్యాయం వలనే బీజేపీకి ఇలా జరిగిందంటూ కొంతమంది సీరియస్ గానే మాట్లాడుతున్నారు. నమ్మిన వ్యక్తే ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తే బీజేపీ కి ఇదే గతి పడుతుందని అంటున్నారు చాలామంది. మోడీ గ్రాఫ్ నెమ్మదిగా పడిపోతున్న ఈ తరుణంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటమి బీజేపీకి అతిపెద్ద వెన్నుపోటు.