Home సినిమా శ్రీదేవికి అంకితమిచ్చేశాడు !

శ్రీదేవికి అంకితమిచ్చేశాడు !

154
SHARE

అందాలతార శ్రీదేవి ఇకలేరు అనే విషయాన్నీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె అకస్మాత్తు మరణం అందరిని కలిచివేసింది. కాగా, రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ “ఎంత సక్కగున్నావె ” అనే సాంగ్ ను కంపోజ్ చేశారు. ఈ సాంగ్ యొక్క సూపర్ సక్సెస్‌ను దేవిశ్రీ ప్రసాద్ ది క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా అయిన శ్రీదేవికి అంకితమిస్తున్నట్టుగా ప్రకటించాడు.

కాగా, శుక్రవారం ఈ సినిమాలోని రెండవ సింగిల్ అయిన ” రంగా రంగా రంగస్థలాన” అనే సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ ఈవెంట్, ప్రి రిలీజ్ ఈవెంట్‌ లను మరికొద్ది రోజుల్లో చిత్రబృందం గ్రాండ్‌గా నిర్వహించనుంది. ఈ సినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .