Home రాజకీయాలు జనసేనతో పొత్తు గురించి బాబు ఇలా మాట్లాడారేంటి ?

జనసేనతో పొత్తు గురించి బాబు ఇలా మాట్లాడారేంటి ?

294
SHARE

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనాడుకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుని యాంకర్ రానున్న ఎన్నికల్లో కూడా జనసేనతో పొత్తు ఉంటుందా అని అడగగా… అప్పుడు చంద్రబాబు జనసేనతో పొత్తు గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. జనసేనతో పొత్తు ఉంటుందా లేదా అనేది అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటుందని.. అందుకే ఇటువంటి ఊహాజనిత ప్రశ్నలకు ఈ సమయంలో సమాధానం చెప్పడం మంచిది కాదని అన్నారు.

చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే పవన్ రాజకీయ భవిష్యత్తు పై బాబు సందేహంగా ఉన్నారా ? పోయిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వలన రాష్ట్రానికి ఇప్పుడు ఇబ్బంది కలిగింది కాబట్టి ఈ సమయంలో పొత్తు గురించి మాట్లాడడం సరికాదని అనుకున్నారా ? లేక బీజేపీ లాగా జనసేనతో కూడా టీడీపీకి సమస్య తెచ్చుకోవడం ఎందుకని భావించారా ?

విపక్షాలు చంద్రబాబు గురించి, పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేస్తుంటే బాబు మాత్రం పవన్ గురించి ఇలా మాట్లాడి ఆ టాపిక్ ని అంతటితో ఫినిష్ చేసేసారు. కాగా, చంద్రబాబు అప్పటికప్పుడు పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలుంటాయి అన్న వ్యాఖ్యను చూస్తే రాజకీయంగా చంద్రబాబు వెనకబడితే అంటే టీడీపీ ఓడిపోవడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా అప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకుంటారా ?