Home రాజకీయాలు లోకేష్‌ వద్దు.. ఎన్టీఆర్ ముద్దు- ప్లకార్డులతో కంగుతిన్న బాబు

లోకేష్‌ వద్దు.. ఎన్టీఆర్ ముద్దు- ప్లకార్డులతో కంగుతిన్న బాబు

897
SHARE

హైదరాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లోతెలంగాణ టీడీపీ కార్యకర్తలు, నేతలతో చంద్రబాబు నిర్వహించిన సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. పార్టీ వైఖరిపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ముందే ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. పరోక్షంగా నారా లోకేష్ తమకు వద్దని స్పష్టం చేశారు. సమావేశం ప్రారంభం కాగానే తెలంగాణ టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

టీఆర్‌ఎస్‌లో టీడీపీని విలీనం చేస్తే అంగీకరించబోమనని హెచ్చరించారు. ఈ పరిమాణంలో చంద్రబాబు కంగుతిన్నారు. 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ టీడీపీ బాధ్యతలను లోకేష్కు అప్పగించారు.

నారా లోకేష్ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ గల్లంతు కావడం, ఓటుకు నోటు కేసు కారణం వల్ల చంద్రబాబు, నారా లోకేష్ హైదరాబాద్‌ వదిలేసి అమరావతికి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు తమకు జూనియర్ ఎన్టీఆర్ కావాలంటూ చంద్రబాబు సమక్షంలోనే నినాదం చేయడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్‌ను వీలైనంత వరకు అణచివేసేలా ప్రణాళికలు రచిస్తుంటే కార్యకర్తలు అందుకు భిన్నంగా స్పందించడం నారా వారికి మింగుడుపడని అంశమే.