Home రాజకీయాలు చూడండి.. ఆంధ్ర జ్యోతి ప్రభుత్వమట!

చూడండి.. ఆంధ్ర జ్యోతి ప్రభుత్వమట!

369
SHARE

మంగళవారం జిల్లా సమాచార శాఖ ద్వారా అందిన ఓ దేవాదాయ శాఖ ప్రెస్‌నోట్‌లో ఓ తప్పు ఉంది. అది కావాలని రాశారో లేక పొరపాటున రాసారో అనేది తెలియదు కానీ ఆ ప్రెస్‌నోట్‌లో “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం” కు బదులుగా “ఆంధ్రజ్యోతి ప్రభుత్వం” అని ఉంది. దీనితో ఆ ప్రెస్ నోట్ ను చూసిన వారందరు షాక్ కు గురి అయ్యి ఆశ్చర్యపోతున్నారు.

ఇదేంటి అని జిల్లా సమాచార శాఖ ఏడీని అడగగా.. ఏమో, ఆ ప్రకటన మాకు అమరావతి కార్యాలయం నుండి వచ్చింది. మేము దానిని అలానే పత్రికలకు పంపడం జరిగిందని వివరణ ఇచ్చారు.

కాగా, “ఆంధ్రజ్యోతి పత్రిక పైన ప్రభుత్వానికి మరియు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు ఇష్టం పెరిగిందనుకుంటా… అందుకే ఏకంగా ప్రభుత్వం పేరునే మార్చివేశారు” అంటూ కొంతమంది కామెంట్ చేస్తే.. మరి కొంతమందేమో “ఆంధ్రజ్యోతి తాను పక్కాగా టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన మీడియా అని ప్రూవ్ చేసుకుందని” అంటున్నారు.