Home సినిమా శ్రీదేవి మరణంపై సినీ ఇండస్ట్రీలో కొత్త ఉద్యమం !

శ్రీదేవి మరణంపై సినీ ఇండస్ట్రీలో కొత్త ఉద్యమం !

SHARE

ప్రముఖ నటి, అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగింది. ఇక శ్రీదేవి లేదు అనే వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆమె సినీ కెరీర్‌ విషయానికొస్తే ఆమె టాలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలను చేసింది. దాదాపు 80కి పైగా దక్షిణాది చిత్రాలలో నటించి ఎక్కువమంది తెలుగు అభిమానులను సంపాదించుకుంది.

అలాంటిది ఇప్పుడు ఆమె చనిపోయింది అని అనగానే అందరూ షాక్ కు గురి అయ్యారు. దక్షిణాది సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు మరియు హీరోయిన్ లందరూ శ్రీదేవితో చేసిన సినిమాలను, తనతో గడిపిన క్షణాలను స్మరించుకుంటున్నారు. కాగా, ఆమె మరణం అనంతరం ఆమె మరణంపై పలు అనుమానాలు అంటూ అనేక రకాల వీడియోలు వస్తున్నాయి. అంతేకాకుండా మీడియా కూడా ఒకదానితో ఒకటి సంభందం లేకుండా భిన్న కథనాలను వినిపిస్తున్నాయి.

దీనితో విసుగెత్తిన సినీ ఇండస్ట్రీ శ్రీదేవిపై వచ్చే వార్తలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టేసి… ప్రశాంతంగా ఆమెను విశ్రాంతి తీసుకోనిద్దాం అంటూ నటీనటులంతా ఒక ఉద్యమాన్ని చేపట్టారు. ” లెట్ హర్ రెస్ట్ ఇన్ పీస్” అనే పేరుతొ సినీ ఇండస్ట్రీకి చెందిన రానా దగ్గుబాటి, తాప్సీ, మంచు మనోజ్, సుధీర్ బాబు, మెహ్రీన్ ఫిర్జాదా,హరీష్ శంకర్, గోపిచంద్ మలినేని మరియు సందీప్ కిషన్ తదితరులు ” లెట్ హర్ రెస్ట్ ఇన్ పీస్” అని శ్రీదేవి ఫొటోకు నమస్కారం పెడుతూ ఉన్న పోస్టులను ట్విట్టర్‌లో పెడుతున్నారు.