Home రాజకీయాలు ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టడం గురించి మాట్లాడిన చంద్రబాబు !

ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టడం గురించి మాట్లాడిన చంద్రబాబు !

SHARE

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనాడుకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో బాబు గారు మాట్లాడుతూ.. ఎన్నికలలో ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టరాదని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పార్టీకి చెందిన ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా సంపాదించారని అన్నారు. ఆ సమయంలో నేను మా పార్టీకి చెందిన వారిని కట్టడి చేశాను. అప్పుడు వారు నాతో ” వాళ్ళు చూడండి ఎలా సంపాదించుకుంటున్నారో, ఎలా చేస్తున్నారో” అని నాకే తిరిగి చెప్పేవారు.

ఎన్నికల సమయంలో ప్రజల మీద డబ్బు ప్రభావం లేకుండా చెయ్యాలి. మన వద్ద డబ్బు లేకపోయినా కూడా మనం ఎన్నికల్లో గెలవాలి. అందుకు గాను 2000 మరియు 500 నోట్లను ఎన్నికల సమయంలో రద్దు చేయాలి. అప్పుడు 100 మరియు 200 రూపాయల నోట్లను కనపడకుండా మోసుకెళ్ళడం కష్టం అవుతుంది. ఇక ఎన్నికల నిర్వహ ణ సమయంను కూడా 14 రోజుల నుండి 10 రోజులకు తగ్గిస్తే బాగుంటుంది.

ప్రజాసేవ చేసిన నాయకులను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకులను ప్రజలు ఎన్నుకోవాలి. వారికీ గౌరవం ఇవ్వాలి. అంతేకాని ఎన్నికల సమయం వరకు ఏదొక పని చేసుకుంటూ ఎన్నికల సమయం వచ్చేసరికి పెద్ద పేద డబ్బు సంచులతో వచ్చి వాటిని పంచిపెట్టి రాజకీయాల్లోకి ఎమ్మెల్యే అనే గుర్తింపు కోసం రావాలనుకోవడం వారి రాజకీయ భవిష్యత్తు కు మంచిది కాదని అన్నారు.

చంద్రబాబు ఇదంతా బాగానే చెప్పారు కానీ… ఆయన ఇంతకూ ఎవరు గురించి మాట్లాడినట్లు ? చంద్రబాబు అసలు ఇప్పటివరకు ఎప్పుడూ ఎన్నికల్లో గెలవడం కోసం డబ్బు ఖర్చు పెట్టలేదా ? మరి నంద్యాలలో ఖర్చు చేసిన కొన్ని కోట్ల రూపాయల విషయం ఏంటి ?