Home రాజకీయాలు వైఎస్‌కు అవకాశం ఇప్పించింది నేనే- చంద్రబాబు

వైఎస్‌కు అవకాశం ఇప్పించింది నేనే- చంద్రబాబు

294
SHARE
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి తన గురించి తానే గొప్పగా చెప్పుకున్నారు. అప్పటికే ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్న వైఎస్ వెంట తిరిగేవారని.. ఖర్చులకు డబ్బులు కూడా ఇప్పించుకునేవారని అందరూ చెప్పే మాట. అంజయ్యపై ఒత్తిడి తెచ్చి మరీ చంద్రబాబుకు మంత్రి పదవి వచ్చేలా వైఎస్‌ చేశారని ఇటీవల విజయమ్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఇప్పుడు చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యాఖ్యానించారు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు ఒక చానల్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌తో తనకు ఎలాంటి వ్యతిగత వైరం లేదని చెప్పారు. వైఎస్‌ అప్పట్లో తన వెంట తిరిగేవారని చంద్రబాబు చెప్పుకున్నారు.  వైఎస్‌కు టికెట్ ఇవ్వాల్సిందిగా ఇందిరాగాంధీకి సిఫార్సు చేశానని చెప్పారు. అందుకు ఆమె అంగీకరించి వైఎస్‌కు టికెట్ ఇచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనలోని చురుకుదనాన్ని చూసి చెన్నారెడ్డే ఆశ్చర్యపోయారని చెప్పుకున్నారు.
వైఎస్‌ ఎలా ఉన్నా తాను మాత్రం హుందాగా వ్యవహరించేవాడినని చంద్రబాబు చెప్పుకున్నారు. మొత్తం మీద.. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావడం, కలాం రాష్ట్రపతి అవడం, వాజ్‌పేయి ప్రధాని అవడం, హైదరాబాద్‌ ప్రపంచ పటంలో చేరడంవంటి వాటికన్నీ కారణం తానేనని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు వైఎస్‌కు టికెట్ రావడం కూడా తన చొరవేనని చెప్పడం మరో ముందడుగే.