ఆంధ్రప్రదేశ్ సర్కార్ పై వైసీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ ఛార్జ్ అయిన శిల్పా చక్రపాణి రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈయన మీడియా వేదికగా టీడీపీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి అలుపెరుగని పోరాటంను చేస్తుందని అన్నారు. అంతేకాకుండా వైసీపీ హోదా కోసమే యువభేరి వంటి అనేక కార్యక్రమాలను కూడా నిర్వహించిందని శిల్పా మరోసారి గుర్తుచేశారు.
పార్టీకి సంబంధించిన ఇంచార్జ్లు, ఎమ్మెల్యేలు మరియు ముఖ్యనాయకులు అందరూ కలిసి మార్చి మూడోవ తేదీన జగన్ మోహన్ రెడ్డిని కలుస్తామని… ఆ తరువాత ఐదవ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అందరం కలిసి మహాధర్నాలో పాల్గొంటామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకున్న ఆకాంక్షలను మరియు మనోభావాలను ఢిల్లీలో వినిపిద్దాం… రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదాను సాధిద్దాం అంటూ శిల్పా నినాదం ఇచ్చారు.
జగన్ మోహన్ రెడ్డి కి ఈ ప్రత్యేక హోదా క్రెడిట్ ఎక్కడ దక్కుతుందో అనే భయంతోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు కలిసి నాటకాలు ఆడుతున్నారని శిల్పా వారి సీక్రెట్ ను బయటపెట్టారు. ప్రత్యేక హోదా విషయంలో పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ కు తెలియదనుకుంటా… రాజకీయాలు అంటే సినిమాలు తీసినంత సులభం కాదని శిల్పా ఎద్దేవా చేశారు.