Home రాజకీయాలు సొమ్మేమో రాష్ట్ర ప్రజలది… సోకేమో చంద్రబాబుది అంటూ కత్తి మహేష్ వివాదాస్పదమైన ట్విట్ !

సొమ్మేమో రాష్ట్ర ప్రజలది… సోకేమో చంద్రబాబుది అంటూ కత్తి మహేష్ వివాదాస్పదమైన ట్విట్ !

SHARE

టీడీపీని టార్గెట్ చేసిన కత్తి.. !

కత్తి మహేష్ మనకు పరిచయం అక్కరలేని పేరు. ఒకప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యారు. దీనితో పవన్ అభిమానుల మధ్య మరియు కత్తి మహేష్ మధ్య తీవ్రస్థాయిలో వివాదం జరిగింది. ఈ వివాదం గురించి మన అందరికి తెలిసిన విషయమే. ఏది ఏమైనా కత్తి మహేష్ ఎదుటివారిపై చేసే విమర్శలలో లోతైన ఆలోచన ఉంటుందని నెటిజెన్లు అంటున్నారు.

అంతేకాకుండా కత్తి మహేష్ సినీ రివ్యూల విషయంలో కూడా ఉన్న‌ది ఉన్న‌ట్టుగా వెల్లడిస్తారని, ఆయన ఎవరికి భయపడే రకం కాదని కూడా అంటుంటారు. కాగా, కత్తి మహేష్ తన ట్విట్టర్ వేదికగా తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై పలు విమర్శలు చేశారు.

” వందల కోట్ల ప్రభుత్వ ధనంను విదేశీ పెట్టుబడులు, భాగ‌స్వామ్య స‌ద‌స్సు లు అంటూ వృధాగా ఖర్చు చేస్తున్నారు. టీడీపీ లక్షల కోట్ల MOU లు పై సంతకం చేశామని ప్రగల్భాలు పలుకుతుంది. ఇలా ప్రగల్భాలు పలకడం కేవలం టీడీపీకే సాధ్యం. వందల కోట్ల ప్రాజెక్టులు నిజమవుతాయే తప్ప రాష్ట్ర ప్ర‌జ‌ల మీద తెచ్చిన‌ లక్షల కోట్ల అప్పులు మాత్రం అలానే ఉంటాయి. సొమ్మేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది… సోకేమో సీఎం చంద్రబాబుది… అప్పేమో ప్రభుత్వానిది” అంటూ కత్తి మహేష్ ట్విట్ చేశారు.

అంతేకాకుండా ” చంద్రబాబు అప్పులు సంపాదించగలగటమే అభివృద్ధికి మెగా ఇండికేటర్ అని చెప్పడం.. దానిని మనం నమ్మడం. రాష్ట్రమేమో అప్పుల పాలు కావడం… మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు ఏమో లోకేష్ పాలుకావ‌డం… తెలుగుదేశం పార్టీకి కావాల్సింది కమ్మోళ్లు. చంద్రబాబు నాయుడు కమ్మోళ్లకు తప్ప మరే కులపోళ్ళకూ చేసిన అభివృద్ధి మనకెందుకు కనపడడం లేదు” అంటూ కూడా కత్తి మహేష్ ట్విట్ చేశారు.

మరి కత్తి మహేష్ చేసిన ఈ ట్విట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో అనేది మాత్రం వేచి చూడాల్సిందే.