Home రాజకీయాలు కొత్త ఎత్తులతో చంద్రబాబుని డైల‌మాలోకి దించిన హరికృష్ణ !

కొత్త ఎత్తులతో చంద్రబాబుని డైల‌మాలోకి దించిన హరికృష్ణ !

1939
SHARE

రాజ్యస‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదల అవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు స్థానాల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో లోక్ స‌త్తా పార్టీ అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయణ టీడీపీ తరుపున పోటీ చేయనున్నారని… టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన పార్టీ తరుపున రాజ్య స‌భ సీటును జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌కు కేటాయించనున్నారనే వార్త హల్ చల్ చేస్తుంది.

ఈ వార్తను తెలుసుకున్న మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, చంద్రబాబు సొంత బావమరిది అయిన హ‌రికృష్ణ చంద్రబాబుని త‌ప్పుబ‌ట్టిన‌ట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయాల నేపథ్యంలో రాజ్య‌స‌భ సీటును తనకు ఇవ్వకుండా ఆ సీటును జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌కు కేటాయించ‌డంతో హ‌రికృష్ణ మ‌న‌స్దాపం చెందారట. దీనితో హ‌రికృష్ణ కొత్త ఆలోచ‌న‌లో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాకుండా గ‌త ఎన్నిక‌ల్లో హిందూపురంలో టీడీపీ త‌రపున ఎమ్మెల్యే గా బాల‌కృష్ణ‌ గెలిచినా కానీ, చంద్రబాబు మాత్రం ఆ నియోజ‌క వ‌ర్గానికి ఎటువంటి నిధులను కేటాయించలేదు. దీనితో అనంత‌పురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ చేసిన అభివృద్ది కార్య‌క్ర‌మాలు ఎక్కడా కూడా కనిపించకపోవడం మరియు చంద్ర‌బాబు కేవ‌లం తెర‌మీద‌కు త‌న కుమారుడు అయిన నారా లోకేశ్ ను మాత్రమే తీసుకురావడం… ఒకప్పుడు ప్రచారానికి వాడుకున్న ఎన్టీఆర్ ని ఇప్పుడు అసలు పార్టీ తరుపున కూడా గుర్తించకపోవడం లాంటి కారణాలతో హ‌రికృష్ణ కొత్త‌దారిని ఎంచుకున్న‌ట్లు సమాచారం. దీనితో చంద్రబాబుని హ‌రికృష్ణ డైల‌మాలో దించారని మనకు అర్ధమవుతుంది.