Home సినిమా శ్రీదేవి మృతిపై దుబాయ్ పోలీసులు అసలు బోనీని ప్రశ్నించలేదట !

శ్రీదేవి మృతిపై దుబాయ్ పోలీసులు అసలు బోనీని ప్రశ్నించలేదట !

168
SHARE

ప్రముఖ నటి, అందాల తార శ్రీదేవి అకస్మాత్తుగా మరణం చెందడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంతేకాకుండా ఈ శ్రీదేవి మృతి కేసు గురించి పది నిమిషాలకొక వార్త బయటకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్ పోలీసులు బోనీ కపూర్‌ను ప్రశ్నించారనే వార్త ప్రచారం జరిగింది. దాదాపు బోనిని పోలీసులు మూడు గంటల పాటూ ప్రశ్నించారనే వార్త వచ్చింది.

కానీ దుబాయ్ పోలీసులు అసలు బోనీ కపూర్‌ను ప్రశ్నించలేదట. కేవలం శ్రీదేవి ఎలా చనిపోయారన్న విషయంపైనే బోనితో వాంగ్మూలం తీసుకున్నారట. అది కూడా ఆదివారం ఉదయం తీసుకున్నారట. ఇక ఆ తరువాత పోలీసులు అసలు బోనిని విచారించలేదట. బోనిపై వస్తున్న వార్తలన్నీ కూడా అవాస్తవమే అని క్లారిటీ ఇస్తున్నారు.

కాగా, శ్రీదేవి భౌతికకాయాన్ని ఇండియాకు తీసుకురావడానికి ఇంకా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని కనిపిస్తుంది. శ్రీదేవి మృతిపై దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్ అధికారులు ఇంకా విచారణను కొనసాగించే పనిలోనే ఉన్నారు. ప్రాసిక్యూషన్‌ నివేదిక అందిన పిదప శ్రీదేవి భౌతికకాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరుగుతుంది. దీనితో శ్రీదేవి భౌతికకాయం ముంబయి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.