Home రాజకీయాలు చంద్రబాబు కొరియా వెళ్లలేదా!.. బీజేపీ ఆధారాలు

చంద్రబాబు కొరియా వెళ్లలేదా!.. బీజేపీ ఆధారాలు

669
SHARE

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మీడియాలో ప్రచారం జరగడమే కానీ.. ఎక్కడా అవి కనిపించడం లేదు. కేంద్ర సంస్థలు కూడా ఏడాదికి నాలుగైదు వేల కోట్లకు మించి ఏపీకి పెట్టుబడులు రావడం లేదని చెబుతున్నారు. అయితే నాలుగేళ్లలో ఏపీకివచ్చిన చెప్పుకోదగ్గ పరిశ్రమ కియా కార్ల పరిశ్రమే.

అనంతపురం జిల్లాలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా కియా కార్ల పరిశ్రమ తమ ఖ్యాతేనని చంద్రబాబు, లోకేష్ చెప్పుకుంటుంటారు. కానీ అది కూడా చంద్రబాబు క్రిడిట్ కాదని ఇప్పుడు బీజేపీ చూపుతున్న ఆధారాలను బట్టి స్పష్టమవుతోంది.

కియా పరిశ్రమ రాకకు చంద్రబాబుకు ఏమాత్రం సంబంధం లేదని బీజేపీ చూపుతున్న ఆధారాల బట్టి స్పష్టమవుతోంది. కియా పరిశ్రమకు సంబంధించిన ఒప్పందం 2015 మే 18న ప్రధాని మోడీ దక్షిణ కొరియా పర్యటనలో జరిగింది.

కియా కార్ల పరిశ్రమ ఒప్పందాన్ని మోడీయే స్వయంగా చేసుకున్నారు. కానీ ఇంతకాలంగా చంద్రబాబు తనవల్లే కార్ల పరిశ్రమ వచ్చిందని చెబుతూ వచ్చారు. బీజేపీ నేత సోమువీర్రాజు.. విష్ణువర్థన్ రెడ్డి చూపిన ఆధారాలను బట్టి కియా పరిశ్రమను తొలుత తమిళనాడులో ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అక్కడి రాజకీయ పరిస్థితుల కారణంగా అనంతరం బెంగళూరు- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ పరిధిలోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశారు.

ఇందులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. మిత్రపక్షం కావడంతో ఇంతకాలం చంద్రబాబు ఏం ప్రచారం చేసినా స్పందించని బీజేపీ నేతలు ఇప్పుడు మేలుకున్నారు. అసలు చంద్రబాబు దక్షిణ కొరియా వెళ్లి కియా కార్ల పరిశ్రమ గురించి చర్చించినట్టు దమ్ముంటే టీడీపీనేతలు ముందుకొచ్చి చెప్పాలని బీజేపీ నేతలు సవాల్ చేస్తున్నారు.

ఇటీవల కియా పరిశ్రమ వద్ద జరిగిన కార్యక్రమంలోనూ చంద్రబాబు క్రిడిట్ అంతా తనదేనని చెప్పారు. ఎక్కడా మోడీ చేసుకున్న ఒప్పందం గురించి చెప్పలేదు. దీంతో బీజేపీనేతలకు మరింత మండిందని చెబుతున్నారు. మొత్తం మీద నాలుగేళ్లలో గొప్పగా చెప్పుకుంటున్న కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు ఖ్యాతి కూడా చంద్రబాబుది కాదన్న మాట.