Home రాజకీయాలు సమ్మిట్లో మందు, విందు, చిందులు.. బాబు స్వయంపర్యవేక్షణ

సమ్మిట్లో మందు, విందు, చిందులు.. బాబు స్వయంపర్యవేక్షణ

SHARE

విశాఖ పెట్టుబడుల సమ్మిట్‌ పెట్టుబడులను ఆకర్శించడం సంగతేమో గానీ… ఈవెంట్‌కు వచ్చిన అతిథులకు మాత్రం విందు, మందు, కనువిందూ మూడు ఏకకాలంలో దక్కుతున్నాయి. స్వయంగా ఏపీ ప్రభుత్వమే అతిథులకు పీకల్లోతు దాకా తాగించింది.

సమ్మిట్‌లో మద్యం ఏరులై పారిన విషయం అక్కడి ఖాళీ బాటిళ్లను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఎంజీఎం పార్కులోపల శనివారం రాత్రి మందు, విందు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా అక్కడే ఉండి మందు, విందు పార్టీలను పర్యవేక్షించారు. అక్కడితో ఆగలేదు. అతిథులను ఆకట్టుకునేందుకు బాలీవుడ్‌ నుంచి ప్రత్యేకంగా డ్యాన్సర్లను రప్పించారు.

మందుకు, విందుకు వారి డ్యాన్సులు కూడా తోడై కనువిందు చేశాయి. ఈ డ్యాన్సులు, మందు పార్టీని నిర్వహించేందుకు ఈ- ఫాక్టర్ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించారు. పార్కులో భారీగా పడి ఉన్న ఖాళీ మద్యం సీసాలనుచూసి అందరూ అవాక్కవుతున్నారు. రాత్రి మద్యం ఏరులై పారిందని ఖాళీ సీసాలను చూసి వారు అభిప్రాయపడుతున్నారు. ఈ మందు పార్టీలో అక్కడ చంద్రబాబు ఉన్న ఫోటోలు కూడా బయటకు రావడం చర్చనీయాంశమైంది.