Home రాజకీయాలు నాడు వైఎస్ రాజశేఖరరెడ్డిపై… నేడు జగన్ పై !

నాడు వైఎస్ రాజశేఖరరెడ్డిపై… నేడు జగన్ పై !

1040
SHARE

అప్పట్లో సీఎం అయిన వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఇప్పటి ముఖ్యమమంత్రి చంద్రబాబు నాయుడు మరియు అతని పార్టీ నేతలు ఎలా అయితే దాడి చేశారో అలానే ఇప్పుడు కూడా ఆయన కుమారుడు మరియు ప్రతిపక్షనేత అయిన జగన్ పై కు దాడి చేస్తున్నారని వైసీపీ నేత,మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆయన తిరుపతిలో జరిగిన పార్టీ శిక్షణ తరగతులలో మాట్లాడుతూ…

జగన్ చేపట్టిన ఓదార్పుయాత్రలో జగన్ కు వస్తున్న ఆదరణను చూసిన చంద్రబాబు దానిని ఓర్వలేక తనకు రాజకీయాలలో ప్రత్యర్థి అంటే జగనే అని భావించి ఆనాడు సోనియా వద్ద సాగిలపడి జగన్ పై లేనిపోని అక్రమ కేసులను బనాయించారని ఆరోపించారు. ఇప్పుడేమో పొత్తు అంటూ అదొక వంక పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ పంచన చేరారు. ఆనాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఎలా అయితే దాడి చెయ్యడం జరిగిందో, నేడు కూడా అలానే విపక్ష నేత అయిన వైఎస్‌ జగన్‌పై కూడా దాడి జరుగుంతుందని అన్నారు.