Home రాజకీయాలు రాజకీయాల నుండి తప్పుకుంటా : బోండా ఉమా !

రాజకీయాల నుండి తప్పుకుంటా : బోండా ఉమా !

1865
SHARE

గ‌త కొన్ని రోజులుగా టీడీపీ నేత, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే అయిన బోండా ఉమామ‌హేశ్వ‌ర రావు పై మరియు అతని కుటుంబంపై భూమిని క‌బ్జా చేశార‌నే పలు వార్తలు వస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఓ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడికి సంబంధించిన భూమిని బోండా ఉమా క‌బ్జా చేశార‌నే వార్త ఇప్పుడు ప్రచారంలో ఉంది. అంతేకాకుండా ఈ విషయంలో బోండా ఉమా స‌తీమ‌ణిపై కూడా కేసు నమోదు అయ్యింది.

దీనితో బోండా ఉమా తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. “నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఏదైనా భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాలు చేశారు. అంతేకాకుండా నా కుటుంబ సభ్యులు కానీ, నేను కానీ, నా అనుచరులు కానీ ఏదైనా తప్పు చేశామని మీకు అనిపిస్తే మీరు చట్ట ప్రకారం వెళ్ళండి.

అంతేకాని మాపై ఇలా బురద చల్లడానికి ఎటువంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దు. భూ కబ్జా ఆరోపణలపై నా ముందుకు ఎవరొచ్చి నిలబడినా కానీ నేను వారితో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను. నాకు కానీ, నా కుటుంబ సభ్యులకు కానీ భూ క‌బ్జాకు సంబంధించిన వ్యవహారాలతో ఎటువంటి సంభందాలు లేవు” అంటూ బోండా ఉమా తనపై ఆరోపణలు చేసే వారిపై ఫైర్ అయ్యారు.