Home రాజకీయాలు టీడీపీ పై కొత్త వ్యవహారానికి తెరతీసిన బీజేపీ !

టీడీపీ పై కొత్త వ్యవహారానికి తెరతీసిన బీజేపీ !

379
SHARE

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో తీవ్ర అన్యాయం జరిగింది. దీనితో టీడీపీ, బీజేపీ నాయకులు ప్రజల ముందు, తెరపై కాస్తా శత్రువులులా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుని ఎలా అయినా ఇరకాటంలో పెట్టాలని బీజేపీ ఓ కొత్త డ్రామాకి తెరతీసింది. రాష్ట్రాన్ని విభజించిన తరువాత రాయ‌ల సీమ‌ నాలుగు జిల్లాల‌కు చంద్రబాబు ఏమి చేయలేదని, వీటిని పూర్తిగా మరిచిపోయారంటూ విమర్శించడం మొదలుపెట్టారు.

కాగా , హైకోర్ట్ ను కర్నూలులో నిర్మిస్తామ‌ని చెబుతూ.. రాయలసీమకు ఎన్నో హామీలను ఇస్తూ బీజేపీ ఓ డిక్ల‌రేష‌న్ ను విడుద‌ల‌చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ డిక్ల‌రేష‌న్ ను పూర్తిగా త‌ప్పు ప‌ట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తమను నమ్మించి బాగా మోసం చేసిందని అన్నారు.

దీనితో చంద్రబాబు తన పార్టీ నేతలతో విభ‌జ‌న చ‌ట్టంలో రాష్ట్రానికి ప్ర‌క‌టించిన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని టెలికాన్ఫ‌రెన్స్ లో మాట్లాడుతూ… వారికీ ఆదేశాలిచ్చారు. ” బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో తమకు తీవ్ర అన్యాయం చేసింది. రాయ‌ల‌సీమ‌లోబీజేపీ, టీడీపీ పై వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. మీరు కూడా అలానే బీజేపీ పై మరియు బీజేపీ నాయకులపై విమర్శలు చెయ్యండి” అంటూ బాబు టీడీపీ నేతలకు ఆదేశాలిచ్చారు.