Home సినిమా శ్రీదేవి చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు.. !

శ్రీదేవి చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు.. !

205
SHARE

శనివారం రాత్రి ప్రముఖ సీనియర్ నటి శ్రీదేవి హఠాన్మరణం చెందిన సంగతి మనకి తెలిసిందే. శ్రీదేవి హఠాన్మరణం చెందడంతో యావత్ దేశం దిగ్ర్భాంతికి గురి అయింది. శ్రీదేవి తన కుటుంబంతో కలిసి ఓ మ్యారేజ్ కోసం దుబాయికి వెళ్ళింది. కానీ, శ్రీదేవి ఆ మ్యారేజ్ లోనే తన తుది శ్వాసను విడిచారు. అయితే శ్రీదేవి చనిపోవడానికి ముందు ఏమి జరిగింది ? శ్రీదేవి భర్త బోనీకపూర్ మ్యారేజ్ అవగానే తన భార్యను సర్‌ప్రైజ్ చేసేందుకు ముంబై వచ్చేశారు.

శనివారం సాయంత్రం “జువైరా ఎమిరేట్స్ టవర్స్” అనే హోటల్‌లో శ్రీదేవి దంపతులు బస చేసి అక్కడ కొంచెం సేపు మాట్లాడుకున్నారట. అనంతరం శ్రీదేవి నిద్రపోయారట. తరువాత బోనీ రాత్రి భోజనానికి వెళ్దాం లే అంటూ భార్యను నిద్ర లేపి తొందపెట్టాడట. అప్పుడు శ్రీదేవి నిద్ర లేచి రెడీ అవుతానంటూ తన భర్తకు చెప్పి బాత్రూంకు వెళ్లారట.

శ్రీదేవి బాత్రూం నుండి ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో టెన్షన్ పడిన బోనీ బాత్రూం డోర్ కొట్టారట. కానీ, లోపల నుండి ఎంతసేపటికి ఎటువంటి స్పందన రాకపోవడంతో బాత్రూం డోర్ ను బోనీ పగలగొట్టించారట. అప్పుడు శ్రీదేవి నిండుగా నీళ్లు ఉన్న బాత్ టబ్‌లో అచేతనంగా పడి ఉన్నారట. దీనిని చూసిన బోనీ షాక్‌కు గురై ఓ ఫ్రెండ్‌కు ఫోన్ చేశారట.

దుబాయ్ పోలీసులకు మరియు డాక్టర్లకు రాత్రి 9గంటల సమయంలో ఫోన్ చేశారట. శ్రీదేవిని పరీక్షించిన డాక్టర్లు ఆమె చనిపోయిందని ధ్రువీకరించారు. శ్రీదేవి బాడీని పోస్ట్ మార్టం కోసం జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్‌కు తరలించారు. శ్రీదేవి భౌతికకాయానికి దుబాయ్‌లో పోస్టు మార్టం కూడా చేసేశారు.