Home సినిమా తనకున్న క్రేజ్‌ను ఫుల్‌గా క్యాష్ చేసుకుంటున్న ప్రియా ప్రకాష్ వారియర్ !

తనకున్న క్రేజ్‌ను ఫుల్‌గా క్యాష్ చేసుకుంటున్న ప్రియా ప్రకాష్ వారియర్ !

SHARE

ఓవర్‌నైట్‌లో స్టార్ డమ్ సంపాదించిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో ఒకరే ప్రియా ప్రకాష్ వారియర్. తాను నటించిన సినిమా ఇంకా విడుదల కూడా అవ్వకముందే ఒక్క వీడియోతోనే స్టార్ డమ్ ను సంపాదించేసుకుంది. కేవలం తన ఎక్స్‌ప్రెషన్స్‌కి అంతటి క్రేజ్, నేమ్ మరియు ఫేమ్ వస్తుందని తాను కూడా ఊహించి ఉండదు. తనకు అంతటి ఫేమ్ ను తెచ్చింది ఆ వీడియో.

అంతటి క్రేజ్‌ను సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పుడు ఆ క్రేజ్‌ నే ఫుల్‌గా క్యాష్ చేసుకుంటోంది. ప్రియా కేవలం ఇన్‌స్టా గ్రాంలో పోస్ట్‌లు చేసేందుకు దాదాపు 8 లక్షల రూపాయలను ఛార్జ్ చేస్తుందట. ఇప్పటి వరకూ ఇంత పెద్ద మొత్తంను వసూలు చేసిన వారిలో బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడీ జాబితాలోకి ప్రియా ప్రకాష్ వారియర్ కూడా చేరింది.