Home రాజకీయాలు టీడీపీలోకి చిరంజీవి ?

టీడీపీలోకి చిరంజీవి ?

1408
SHARE

మెగాస్టార్ చిరంజీవి టీడీపీలోకి రాబోతున్నారా ? తమ్ముడు పవన్ కళ్యాణ్ తేరా వెనుక చక్రం తిప్పుతున్నారా ? దీని మేరకు బాబుని ఒప్పించే పనిలో పడ్డారా ? అవుననే అంటున్నాయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు. మరి తెలుగువాళ్లు ఊహించని ఈ పరిణామానికి కారణాలేంటి ? అసలేమీ జరుగుతుంది ? అన్నయ్య చిరంజీవి కోసం పవన్ కళ్యాణ్ కొత్త ఎత్తులు వేస్తున్నారా ? ఏకంగా చంద్రబాబు ముందే కొత్త ప్రపోజల్ ను పెట్టారా ? ఈ విషయంపై ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చ కొనసాగుతుంది.

త్వరలో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది. దీనితో ఆయన మరోసారి రాజ్యసభకు ఎన్నిక కావాలనుకుంటున్నారని ఆయన భావిస్తున్నారు. అందుకే పవన్ చంద్రబాబు ముందు ఓ కొత్త ప్రపోజల్ ను పెట్టారట. అదేమిటంటే త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండు స్తనాలు దక్కడం మాత్రం కచ్చితం. అందులో ఒకదానిని చిరంజీవికి ఇవ్వాలని బాబుని పవన్ కోరినట్లు చెబుతున్నారు.

కానీ, పవన్ ప్రపోజల్ కు చంద్రబాబు నో చెప్పారని కూడా అంటున్నారు. ఈ రెండు సీట్లు ఎవరికి ఇవ్వాలని చంద్రబాబు ఇప్పటికే సర్వే చేయించారని, సర్వే సారాంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ కి వినిపించారని అందరూ అంటున్నారు. ఈ సర్వే లో ఒక సీటు ను లోక్ సత్తా వ్యవస్థపుడు జయప్రకాశ్ నారాయణకు ఇవ్వాలని వచ్చిందట.

ఇక రెండో సీటును చిరంజీవికి ఇవ్వొచ్చా అని సర్వే చేస్తే అందులో చిరంజీవికి నెగటివ్ పాయింట్స్ వచ్చాయట. రాజకీయంగా చిరంజీవి యాక్టీవ్ గా లేకపోవడం, రాష్ట్రానికి సంభందించిన అంశాలపై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడమే చిరంజీవికి నెగిటివ్ గా మారిందని సమాచారం. ఇదే విషయాన్నీ పవన్ ముందు ఉంచారట చంద్రబాబు. కాపులు కూడా చిరంజీవి అంశాన్ని పాజిటివ్ గా తీసుకోవడం లేదని వెలువడిందట. అందుకే పవన్ ప్రపోజల్ కి చంద్రబాబు నో చెప్పారని వ్యాఖ్యానిస్తున్నారు.