Home రాజకీయాలు జగన్ పై కక్ష కట్టిన tv ఛానళ్ళు ఇవేనా?

జగన్ పై కక్ష కట్టిన tv ఛానళ్ళు ఇవేనా?

SHARE

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లినరీ.. తెలుగుదేశానికి మహానాడు ఎలానో వైసీపీకి ప్లినరీ సమావేశాలు అలానే. ఏపీ రాజకీయాలకు సంభందించిన వార్తాలను వార్తలా చూయించడం కోసమైనా ప్లినరీ కవరేజ్ తప్పదు. వైసీపీ ప్రేక్షకులు, తటస్థ ప్రేక్షకులకే కాదు ఆ ప్లేనరీలో ఏమి జరుగుతుందో తెలుగుదేశం ప్రేక్షకులకు చూడాలనే ఉంటుంది.

వైసీపీ ప్లినరీ కవరేజ్ ఏ ఏ టీవీ ఎంత సమయాన్ని కేటాయించిందో ఎవరు ఏ ప్రాధాన్యం ఇచ్చేరో అనేది తెలిసేలా చంద్రబాబు కాంప్ మొత్తం టీవీ ఛానెళ్ల కవరేజ్ మొత్తంను ట్రాకింగ్ చెయ్యడమే తాజా విశేషం. అంతేకాదు.. జగన్ కు టీడీపీ నాయకులు ఇచ్చిన కౌంటర్లకు కూడా ఏ ఏ టీవీ ఛానెళ్లు ఎలా కవరేజ్ చేసింది అనే అంశంపై కూడా ఓ డేటా ప్రిపేర్ చేశారట. ఆ డేటా ఎలా ఉందొ మీరు కూడా చూడండి.

మనకున్న ఏడు ప్రధాన ఛానెళ్లలో సాక్షి టీవీ వైసీపీ సొంత ఛానెల్. ఇక మిగతా వాటిల్లో ntv, etv, abn, tv5 లు కమ్మ సామజిక వర్గానికి చెందిన ఛానెళ్లు. అంటే ఓనర్లు. 10టీవీ సిపిఎంకు చెందిన ఛానెల్. tv9 వివిధ భాగస్వాములున్న ఛానెల్. అయితే అవి రెండూ కమ్మ సామజిక వర్గానికే చెందిన తమ్మినేని రవిప్రకాష్ ప్రభావం ఉన్న ఛానెళ్లు. ఇది సోషల్ మీడియాలో సాగుతున్న విశ్లేషణ.

సరే.. ఇప్పటి ఏపీ రాజకీయాలలో కుల ప్రభావం ఎక్కువగా ఉందనేది అందరూ అంగీకరించేదే. కాదనలేదనే నిజం. జగన్ అంటే విషం కక్కే మీడియా లలో etv 88 నిమిషాలు అంటే దాదాపు గంటన్నారా. అలాగే జగన్ పై విరుచుకు పడే abn 59 నిమిషాలు అంటే ఒక గంట సేపు ప్లినరీ వార్తలు కవర్ చేసాయి. tv9 కూడా గంటన్నార పటు కవర్ చేసింది.

ఇక ప్రతిపక్ష పాత్రలో ఉన్న 10టీవీ 130 నిమిషాలు అంటే రెండు గంటలకి పైగా కవరేజ్. ntv మాత్రం 218 నిమిషాలు అంటే మూడున్నర గంటలకు పైగా. ఇది చెప్పుకోదగినదే. అయితే tv5 29 నిమిషాలు అంటే కేవలం అరగంటలోపే. ఎందుకీ వివక్షా అనేది ఇప్పుడు జగన్ ఫ్యాన్స్ మరియు వైసీపీ నేతలలో చర్చనీయాంశం అయ్యింది.