Home రాజకీయాలు ఆది కొడుక్కి కూడా జగనే లైఫ్‌ ఇచ్చారా?

ఆది కొడుక్కి కూడా జగనే లైఫ్‌ ఇచ్చారా?

SHARE

జగన్‌ కుటుంబ చరిత్రపై చర్చకు సిద్దమన్న మంత్రి ఆదినారాయణరెడ్డిపై వైసీపీ నేత సుధాకర్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. ఆదినారాయణరెడ్డి నీవెంత.. నీ బతుకెంత.. నీవా వైఎస్ కుటుంబం గురించి చర్చించేది అని మండిపడ్డారు.

ఆదినారాయణరెడ్డి బతుకు టీడీపీ నేతలకంటే తమకే ఎక్కువ తెలుసన్నారు. వైఎస్ లేకుంటే ఈ రోజు రాజకీయంగా ఆదినారాయణరెడ్డి ఎక్కడుండేవారని ప్రశ్నించారు. ఎక్కడో పిల్లలకు పాఠాలు చెప్పుకునే ఆదినారాయణరెడ్డిని ఎమ్మెల్యేను చేసింది వైఎస్ కాదా అనిప్రశ్నించారు. ఈ రోజు గుంట నక్క చంద్రబాబు పంచన చేరి వైఎస్ కుటుంబాన్ని విమర్శించడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు.

చంద్రబాబు డైనింగ్‌ టేబుల్‌ వద్ద చేతులు కట్టుకుని నిలబడి చంద్రబాబు వేసే ఎంగిలిమెతుకులు తినే నీవా వైఎస్ కుటుంబాన్ని విమర్శించేది అని సుధాకర్ బాబు మండిపడ్డారు. మూడు సార్లు ఓడిపోయినా సరే.. కడప జిల్లాలో హేమాహేమీలు ఉన్నా సరే మీ అన్నకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చింది వైఎస్‌ అని గుర్తు చేశారు.

చివరకు ఆదినారాయణరెడ్డి కుమారుడికి కాంగ్రెస్‌లో జిల్లా యువజన అధ్యక్షుడు పదవి కూడా జగన్‌ సిఫార్సు వల్లే వచ్చిన సంగతి మరిచిపోవద్దని గుర్తు చేశారు. జగన్‌ సూచన మేరకే నాడు తాను కాంగ్రెస్ రాష్ట్ర యువజన అధ్యక్షుడు హోదాలో నారాయణరెడ్డి కుమారుడికి జిల్లా యువజన అధ్యక్ష పదవి ఇచ్చానని సుధాకర్ బాబు చెప్పారు.

నిజంగా ఆదినారాయణరెడ్డి కడప రెడ్డే అయితే ముందు వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. తిరిగి సైకిల్ గుర్తుపైగెలిచి అప్పుడు మాట్లాడాలని సుధాకర్ బాబు సవాల్ చేశారు. ఆదినారాయణరెడ్డి పిచ్చికుక్క కరిచినవాడి తరహాలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.