Home రాజకీయాలు బీజేపీ అర్దరూపాయి సాయం కూడా చేయలేదట !

బీజేపీ అర్దరూపాయి సాయం కూడా చేయలేదట !

295
SHARE

ప్రత్యేక హోదా సాదన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ బీజేపీ పై ధ్వజమెత్తారు. బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆయన విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ఎటువంటి సహాయం చేయలేదని, వారికీ కనీసం అర్దరూపాయి సాయం కూడా చేయలేదని అన్నారు. మోడీ బుందేల్‌ఖండ్‌కు కొన్ని వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు కానీ ఆంధ్రప్రదేశ్ ని మాత్రం అసలు లెక్కలోకి కూడా తీసుకోవడం లేదని మండిపడ్డారు.

అనంతరం ఆయన రాజమండ్రి లో ఏప్రిల్ ఇరవైన జరిగే ప్రత్యేక హోదా ఆత్మగౌరవ సదస్సుకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. తరువాత సిపిఐ కార్యదర్శి అయిన కె.రామకృష్ణ మాట్లాడుతూ… కర్నూలులో బీజేపీ నాయకులు సభ పెట్టి మరి అక్కడి ప్రజలకు రాయలసీమ డిక్లరేషన్‌ అంటూ చెబుతూ కొత్త డ్రామాకు తెరతీస్తున్నారని విమర్శించారు.