Home రాజకీయాలు రాయపాటి, విజయసాయిపై ఇందుకే ఫైర్ అయ్యారా ?

రాయపాటి, విజయసాయిపై ఇందుకే ఫైర్ అయ్యారా ?

SHARE

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అధికార తెలుగుదేశం పార్టీ లోకి వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలను ఫిరాయింపజేయడానికి సీఎంఓలో ఉన్న సతీష్ చంద్ర , రాజమౌళి, సాయిప్రసాద్ అనే ఐఏఎస్ అధికారులు మరియు ఏబీ వెంకటేశ్వరరావు అనే ఐపీఎస్ అధికారి రాజకీయ లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అనర్హత పిటిషన్లపై స్పీకరు కార్యాలయం ఎటువటిని నిర్ణయంను తీసుకోకుండా వారిని వీళ్లు ప్రభావితం చేస్తున్నారని కూడా ఆరోపించారు.

విజయసాయి చుసిన ఈ ఆరోపణలపై చంద్రబాబు స్పందించి విజయసాయి అధికారులకు సారీ చెప్పాలంటూ ప్రకటించారు. అంతటితో ఆగని టీడీపీ నేతలు విజయసాయి పై విమర్శల వర్షం కురిపించారు. ఇదంతా బాగానే ఉంది కానీ… ఈ వ్యవహారంలోకి నరసరావుపేట ఎంపీ అయిన రాయపాటి సాంబశివరావు కూడా రంగ ప్రవేశం చేసి విజయసాయినిఎడాపెడా విమర్శించారు.

రాయపాటి విజయసాయి పై ఎందుకిలా స్పందించాడంటే సీఎంఓలో ఉన్న అధికారి రాజమౌళి రాయపాటికి స్వయానా దగ్గరి బంధువు అట. తన బంధువుకు విజయసాయి చేసిన ఆరోపణల వలన ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని భయపడి అందరికంటే ఎక్కువగా స్పందించి విజయసాయి పై డీజీపీకి ఫిర్యాదు చేస్తాం అంటూ రెచ్చిపోయారు.

అంతేకాని రాయపాటికి ఐఏఎస్ అధికార్ల మీద ఎటువంటి గౌరవం లేదు. ఒకవేళ ఉంటే గతంలో వైఎస్ జగన్ అహ్మద్ బాబు పట్ల అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తే రాయపాటి అప్పుడెందుకు స్పందించలేదు.. ఇప్పుడు రాజమౌళి రాయపాటికి స్వయానా దగ్గరి బంధువు అవ్వడంతోనే ఇలా స్పందించారని పలువురు అంటున్నారు.