Home సినిమా పవన్ బలహీనత అతని ఫ్యాన్సే అంటూ కత్తి ట్విట్ !

పవన్ బలహీనత అతని ఫ్యాన్సే అంటూ కత్తి ట్విట్ !

SHARE

కత్తి మహేష్ మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య జరిగిన వార్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఈ వార్ ను ముగించడానికి ఇరువురూ పార్టీ చేసుకొని మరి ఈ వార్ కు స్వస్తి చెప్పేశారు. ఆ తరువాత కత్తి మహేష్ కొన్ని రోజుల నుండి పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా ఏమి మాట్లాడలేదు. మరల ఏమైందో ఏమో కానీ కత్తి మహేష్ మరల పవన్ పై ఓ ట్విట్ చేశారు.

పవన్ తనను పట్టించుకోవడం లేదంటూ కత్తి ఇటీవల ట్విట్ చేశారు. ఈరోజు మరల కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ బలహీనత అంటూ మరో ట్విట్ చేశారు. ” జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ కు బలం ఏమిటనేది నాకింకా తెలియదు కానీ, ఆయన బలహీనత మాత్రం మైండ్ లెస్, నోళ్లు అదుపులో లేని ఫ్యాన్సే. పవన్ రాజకీయాలలో ఎదగడానికి తన మానాన తాను జే ఎఫ్ సీ అంటూ ఏవో ప్రణాళికలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే… పఅవణ ఫ్యాన్స్ మాత్రం రాజకీయంగా పవన్ భూస్థాపితం అవ్వడానికి తూట్లు పొడుస్తూన్నారని” ట్విట్ చేశారు.