Home రాజకీయాలు బీజేపీ- టీడీపీ ల మధ్య కొత్త పంచాయితీ !

బీజేపీ- టీడీపీ ల మధ్య కొత్త పంచాయితీ !

SHARE

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీల మధ్య ఓ కొత్త పంచాయతీ ఆరంభమైనట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బీజేపీ నేతలు కొత్త డిమాండ్లను సంధించారు. సీమకు సంబందించి కర్నూలు లో జరిగిన సమావేశంలో బీజేపీ నేతలు ఓ డిక్లరేషన్ ను విడుదల చేశారు. ఈ డిక్లరేషన్‌లో రాష్ట్రంలో హైకోర్టును ఏర్పాటు చేయడం, రాష్ట్రానికి రెండో రాజధానిని ఏర్పాటు చేయడంతో పాటుగా ఉన్న నాలుగు జిల్లాలను కూడా ఎనిమిది జిల్లాలుగా పెంచాలని సూచించారు.

అంతేకాకుండా రాయలసీమ అభివృద్ధి బోర్డును పునరుద్ధరించి రాజ్యాంగబద్ధత కల్పించడం మాత్రమే కాకుండా 10 వేల కోట్ల రూపాయలను కూడా కేటాయించాలని పేర్కొన్నారు. ఆరునెలలకు ఒకసారి రాయలసీమలో అసెంబ్లీ సమావేశాలను నడపాలని కూడా వారు కోరారు. రాయలసీమకు వచ్చే బడ్జెట్‌లో 20వేల కోట్ల రూపాయలను కేటాయించాలని కోరారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, గురు రాఘవేంద్రస్వామి ప్రాజెక్ట్‌లను 2019కల్లా పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.

కడపలో హైకోర్టు సాధనకు సమావేశం జరపాలని కూడా నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఎలా అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి ఉనికిని చాటుకోవడానికి ఇప్పుడు ఈ డిమాండ్లతో ముందుకు వచ్చారు.