Home రాజకీయాలు రైతులపై చంద్రబాబు దారుణ వ్యాఖ్యలు

రైతులపై చంద్రబాబు దారుణ వ్యాఖ్యలు

427
SHARE

మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఓట్లేసిన ప్రజలనే కించపరిచారు. రైతులు కష్టాల్లో ఉన్నారు.. వారి కోసం ఏం చేసినా తక్కువే అందుకే రుణమాఫీ ప్రకటిస్తున్నా అని ఎన్నికలకు ముందు చెప్పి ఎగనామం పెట్టిన బాబుగారు… ఇప్పుడు రైతుల పట్ల తనకున్న అసలు ఉద్దేశాన్ని బయటపెట్టారు.

తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయం దండగా అని వ్యాఖ్యానించిన తనలోని మరమనిషిని మరోసారి తట్టిలేపారు చంద్రబాబు. ఈ-ప్రగతి ఐఎస్‌బీ గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్ల ప్రదానోత్సవంలో మాట్లాడిన చంద్రబాబు… పేదలపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకు జనం బానిసలయ్యారని వ్యాఖ్యానించారు.

రైతుల ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, క్రాప్ సబ్సిడీకి అలవాటు పడ్డారని వ్యాఖ్యానించారు. రైతులు ఇన్‌ఫుట్‌ సబ్సిడీకి బానిసలయ్యారని ఈ పద్దతి మారాలని తనలో దాగి ఉన్న అసలు విజన్‌ను బయటపెట్టారు విజనరీ బాబు. చంద్రబాబు వ్యాఖ్యలపై రైతు సంఘాలు మండిపడ్డారు.

చంద్రబాబు ఇచ్చే సబ్సిడీల కోసమే రైతులు వ్యవసాయం చేస్తున్నట్టుగా ఆయన తీరు ఉందని.. ఇలా అన్నంపెట్టే రైతులను కించపరడం సరికాదని హితవు పలికారు. విపత్తుల సమయంలో పంట నష్టం జరిగినప్పుడు రైతులకు సబ్సిడీ ఇస్తుంటారని.. దాన్ని కూడా హేళన చేస్తే అన్నం పెట్టిన రైతుల గోడు తగలకపోదని హెచ్చరిస్తున్నారు.