Home రాజకీయాలు పచ్చ తమ్ముళ్లు క్లారిటీ లేక పరువు తీసేస్తున్నారు !

పచ్చ తమ్ముళ్లు క్లారిటీ లేక పరువు తీసేస్తున్నారు !

SHARE

మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ పక్క ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడిపోరాటం అవసరం అంటాడు. మరో పక్కనేమో వైసీపీ అధినేత జగన్ కుట్రలు చేస్తున్నాడు, మోసాలు చేస్తున్నాడు, వారితో వీరితో కుమ్మక్కు అవుతున్నాడు అంటూ విమర్శిస్తారు. అంతేకాకుండా వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తామన్నా కూడా వాటిని అతి సులభంగా డ్రామాల కింద కొట్టివేస్తారు. అవిశ్వాసం కంటె రాష్ట్రమే ముఖ్యమని అంటారు గంట.

ఇక మరో మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విషయానికొస్తే ప్రత్యేకహోదా కోసం వైసీపీ నేతలు దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టాలని అంటారు. ఇందులో అర్ధం కానిదేంటంటే వైసీపీ అధినేత జగన్ అవిశ్వాసం పెట్టబోతున్నట్లు ప్రకటించి దానికి ముహూర్తం పెట్టిన తర్వాత కూడా ఈయన ఇప్పుడొచ్చి ఇలా దమ్ము,ధైర్యం ఉంటే కేంద్రంపై అవిశ్వాసం పెట్టండి అంటూ సవాలు విసురుతున్నారు. ఇప్పటివరకూ ఈయన ఎక్కడ నిద్రలో జోగుతున్నారో అని ప్రజల సందేహం.

ఇక మరో మంత్రి అయిన చినరాజప్ప ప్రజలకు జగన్ చెప్పే మాటలపై నమ్మకం లేదని, ప్రజలు అందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతారు. సదరు హోం మంత్రి గారేమో తెలుగుదేశం పార్టీకి రాజకీయం ఏమి అవసరం లేదని కేవలం రాష్ట్ర అభివృద్ధినే ముఖ్యమని బోధిస్తారు. ఇలా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు వాళ్లలో వాళ్ళకే క్లారిటీ లేకుండా ఎవరికి వారు ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పరువును బజారునా పెట్టేస్తున్నారు. వీరి వ్యవహారశైలిని చూస్తున్న ప్రజలు నవ్వుకుంటున్నారు.