Home రాజకీయాలు రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

374
SHARE

ఏప్రిల్‌లో ఖాళీ అవనున్న రాజ్యసభ స్థానాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఏపీ నుంచి మూడు, తెలంగాణ నుంచి మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మార్చి 5న నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 12 వరకు నామినేషన్ దాఖలుకు గడువు ఉంటుంది. మార్చి 13న నామినేషన్లు పరిశీలిస్తారు. మార్చి 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

మార్చి 23 పోలింగ్‌ జరుగుతుంది అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తారు. ప్రస్తుత బలాల ప్రకారం ఏపీలో టీడీపీకి రెండు, వైసీపీకి ఒక స్థానం దక్కనున్నాయి. వైసీపీ తన అభ్యర్థిగా ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిని ప్రకటించింది.

టీడీపీ నుంచి లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, రిలయన్స్ ఉపాధ్యక్షుడు మాధవ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీ నుంచి రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్‌, చిరంజీవిల పదవీకాలం ముగియనుంది. తెలంగాణ నుంచి సీఎం రమేష్,ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.