Home రాజకీయాలు జగన్‌పై ఆదినారాయణరెడ్డి అనుచిత వ్యాఖ్యలు

జగన్‌పై ఆదినారాయణరెడ్డి అనుచిత వ్యాఖ్యలు

1141
SHARE

జమ్మలమడుగు నియోజకవర్గంలో నిధులను రామసుబ్బారెడ్డితో కలిసి సగం సగం పంచుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఇద్దరు ఐఏఎస్‌ల సమక్షంలో పంచాయితీ చేసి ప్రకటించారని మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

ఇప్పటికే ఐఏఎస్ లు టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విమర్శలు వస్తున్న వేళ… మంత్రి వ్యాఖ్యలు దుమారం రేపాయి. సామాన్యులు,నెటిజన్లు ఆదినారాయణరెడ్డిని బండబూతులు తిడుతున్నారు. సగంసగం పంచుకుని తినడానికి అది మీ బాబు సొమ్మా అని ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి ఆదినారాయణరెడ్డి వైసీపీపై ఫైర్ అయ్యారు. రామసుబ్బారెడ్డికి, తనకు చంద్రబాబు పంచాయితీ చేశారని తాను సానుకూల కోణంలో చెబితే వైసీపీ దాన్ని నెగిటివ్‌గా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తనను విమర్శించే శక్తిని జగన్‌ ఎప్పుడో కోల్పోయారని చెప్పారు. ఈ సందర్భంగా జగన్‌పై మంత్రి కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు.

జగన్ ఒక ఊరపంది అని వ్యాఖ్యానించారు.జగన్‌ ఆలోచనలన్నీ ఊరపంది ఆలోచనలు అని.. జగన్‌ ఒక దగుల్బాజీ మనిషి అని విరుచుకుపడ్డారు. జగన్‌ కుటుంబచరిత్ర మొత్తం బయటపెడుతానని మంత్రి హెచ్చరించారు. జగన్ తాత రాజారెడ్డి గుట్టు బయటపెడుతానన్నారు. తాను మంత్రి హోదాలో దర్జాగా సచివాలయానికివస్తే… జగన్ మాత్రం చేతులు కట్టుకుని కోర్టుకు వెళ్తారని ఆదినారాయణరెడ్డి విమర్శించారు.