Home రాజకీయాలు చంద్రభజన చేసి తుస్సుమనిపించేసిన కమల్!

చంద్రభజన చేసి తుస్సుమనిపించేసిన కమల్!

SHARE

కమల్ హాసన్ బుధవారం నాడు చెన్నైలో ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటుచేశారు. ఆ ప్రెస్ మీట్ లో కమల్ చంద్రబాబు యొక్క భజన చేసి ఒక్కసారిగా తుస్సుమనిపించేశారు. కమల్ ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. తన రాజకీయ హీరో చంద్రబాబు అని ప్రకటించాడు. అవినీతికి అడ్డా అయినా చంద్రబాబుని కమల్ తన రాజకీయ హీరో అని అంటున్నాడంటే కమల్ కు రాజకీయాల మీద ఎంతటి అవగాహన ఉందొ అనేది మనం ఇట్లే అర్ధం చేసుకోవొచ్చు.

అన్నా డీఎంకే రాజకీయ విధానాలపట్ల కమల్ విముఖతను బాహాటంగా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా బీజేపీపై కూడా కమల్ విముఖత ఉందని ప్రకటించారు. బీజేపీతో తన పార్టీ ఎప్పుడూ దోస్తీ చేయదని కూడా కమల్ వెల్లడించేసాడు. కానీ, కమల్ తన రాజకీయ హీరో అని చెప్పుకుంటున్నా బాబు ఏమో బీజేపీని అవసరమైనప్పుడు నెత్తిన పెట్టుకొని తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకున్నాడు. అటువంటి బాబు కమల్ కు ఎలా హీరో అయ్యాడో అనేది మాత్రం ఎవరికి అర్ధం కానీ విషయం.

రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా కూడా బీజేపీతో బయటకురాలేని పరిస్థితిలో ఉన్న బాబులో కమల్ ఏమి చూసి హీరో అంటున్నాడో అనేది తెలియడం లేదు. ఇక తమిళ రాజకీయాల విషయాలకొస్తే అక్కడ కూడా ఇంతే. ఒకప్పుడు బాబు అన్నా డీఎంకేను నెత్తిన పెట్టుకున్నాడు. ఈ విషయంను కూడా కమల్ మరచిపోయాడనుకుంటా. పరమ అవినీతిపరుడిగా పురట్చితలైవి సిఫారసు మేరకే తేలిన శేఖర్ రెడ్డికి చంద్రబాబు తిరుమల వేంకటేశ్వరుని ధర్మకర్తల మండలిలో చోటు ఇచ్చారు. అలాంటి చంద్రబాబుని కమల్ తన ఆదర్శ హీరో అని ఎలా చెప్పగలుగుతున్నారు అని జనం అనుకుంటున్నారు.