Home రాజకీయాలు సంచలనం.. అనూహ్య మలుపు తీసుకున్న ఓటుకు నోటు కేసు

సంచలనం.. అనూహ్య మలుపు తీసుకున్న ఓటుకు నోటు కేసు

SHARE

ఓటుకు నోటు కుంభకోణంలో సంచలన మలుపు. ఏ- నిందితుడు జెరూసలేం మత్తయ్య అప్రూవర్‌గా మారేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు మత్తయ్య.

ఓటుకు నోటులో అనైతిక చర్యలకు పాల్పడిన వారు తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. తనను చంపేసి కేసులో కీలక విషయాలు బయటకు రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఈ మేరకు తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయని మత్తయ్య వివరించారు.

కాబట్టి   కోర్టు ముందు తనకు తెలిసిన రహస్యాలన్నీ చెబుతానని అందుకు అవకాశం ఇవ్వాలని మత్తయ్య కోరారు. కేసులో పెద్దపెద్దవాళ్లు ఉన్నారని.. కాబట్టి ఓటుకు నోటు కేసుతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగించాలని మత్తయ్య కోరారు.

కోర్టు ముందు తాను చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. ప్రాణహాని ఉన్నందున ముందే అన్ని విషయాలు కోర్టుకుచెప్పేస్తానని వాటిని రికార్డ్ చేయాలని కోరారు.

ఓటుకు నోటు కేసు కనుమరుగైపోయినట్టేనని భావిస్తున్న వేళ.. హఠాత్తుగా ఏ-4 అప్రూవర్‌గా మారేందుకు సిద్ధవడంతో టీడీపీలో కలకలం రేపుతోంది. మోడీని, బీజేపీని ఇటీవల టీడీపీ, చంద్రబాబు అనుకూల మీడియా దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో రాజకీయంగానే ఈ పరిణామం చోటు చేసుకుందా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.