ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికలు కూడా జరుగుతుండడంతో రోజుకొక వార్త వినపడుతుంది. ఈ రాజ్యసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి రెండు రాజ్యసభ సీట్లు, వైసీపీకి ఒక రాజ్యసభ సీటు దక్కనుంది. కాగా, పవన్ కళ్యాణ్ కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల విషయంలో నిజానిజాలు ఏంటో అనేది తెలుసుకోవడానికి జేఎఫ్ సీ ( ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ) అనేది ఏర్పాటు చేసిన సంగతి మనకి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ ఈ కమిటీలోని మొదటి సభ్యుడు అయిన లోక్ సత్తా వ్యవస్ధాపకులు జయప్రకాష్ నారాయణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు… ఎందుకంటె రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను ఎందుకైనా వాడుకోవొచ్చు అని అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వత్తాసు పలికారు.
జేపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఇలా వ్యాఖ్యలు చెయ్యడంతో ఇవి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జేపీ చేసిన ఈ వ్యాక్యలను బట్టి చూస్తుంటే ఈయన అధికార పార్టీకి అనుకూలంగానే మాట్లాడారని అర్ధమవుతుంది. జేపీ ఇలా ఎందుకు మాట్లాడారంటే… చంద్రబాబు జేపీకి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండడం వలనే ఇలా మాట్లాడారని సమాచారం. ఈ విషయంపై ఓ తెలుగు దినపత్రిక కూడా కథనం రాయడంతో ఇప్పుడీ విషయం తీవ్ర సంచలనంగా మారింది.
కాగా, ఈ రాజ్యసభ సీటుపై టీడీపీకి చెందిన కొంతమంది కీలక వ్యక్తులు ఆశలు కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ రాజ్యసభ సీటును జేపీకి నిజంగానే ఇవ్వనున్నారా ? అసలు చంద్రబాబు ఈ రాజ్యసభ సీట్ల కేటాయింపు వెనుక ఎటువంటి వ్యూహాన్ని రచిస్తున్నారు అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.