Home సినిమా మ‌హేష్ భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌పై బాలీవుడ్ న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

మ‌హేష్ భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌పై బాలీవుడ్ న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

202
SHARE

బాలీవుడ్ న‌టి నేహా ధూపియా నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నేహా ధూపియా మ‌లైకా ను “మీకు మోడ‌లింగ్‌లో ఎటువంటి అనుభవాలు కలిగాయి” అని అడగగా.. అప్పుడు మ‌లైకా అరోరా ఖాన్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు భార్య అయిన న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌పై కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

“నేను బాలీవుడ్‌లోకి రాక‌ముందు మోడలింగ్ రంగంలో పనిచేసేదానిని. నేను మోడ‌లింగ్ రంగంలోకి వెళ్ళినప్పుడు మోడ‌లింగ్ రంగంలో న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌, మోహ‌ర్ జెస్సియాలు నాకు సీనియారులు. వారిద్దరూ అప్పటికే టాప్ మోడ‌ల్స్‌గా ఉన్నారు. అప్పుడు నేను వారికీ జూనియ‌ర్‌ ను. ఆ సమయంలో వారిద్దరూ నాతో కొంచెం దురుసుగా ప్ర‌వ‌ర్తించేవారు. కానీ ఇప్పుడు నేను వారిద్దరితో స్నేహంను కొన‌సాగిస్తున్నాను” అని మ‌లైకా అరోరా ఖాన్ చెప్పుకొచ్చింది.