Home సినిమా రాజమౌళి సినిమా కోసం శిక్షణ తీసుకుంటున్న ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ !

రాజమౌళి సినిమా కోసం శిక్షణ తీసుకుంటున్న ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ !

274
SHARE

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మరియు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ త్వరలోనే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేయనున్నారు. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కూడా మంచి స్నేహితులే అవ్వడంతో వీరిద్దర్నీ పెట్టి రాజమౌళి ఈ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టాలివుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాజమౌళి కూడా ఈ సినిమాకు స్క్రిప్ట్ ను అందించే పనిలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా మొత్తం బాక్సింగ్‌ క్రీడతో సాగుతుందని గాసిప్స్ వస్తున్నాయి. దీనిప్రకారం ఆలోచిస్తుంటే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఈ సినిమాలో బాక్స‌ర్లుగా కనిపించనున్నారట. అందుకే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఈ సినిమా కోసం బాక్సింగ్ కు సంబంధించిన శిక్ష‌ణ తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ సినిమాల యొక్క షూటింగ్ లు పూర్తి అవ్వగానే వీరిద్దరూ ఈ సినిమా కోసం బాక్సింగ్ శిక్షణ తీసుకోనున్నారు.