Home రాజకీయాలు చూస్తామంటే.. నేనే రెడీ.. మరో ఇద్దరు ఐఏఎస్‌లపై సాయిరెడ్డి ఆరోపణలు

చూస్తామంటే.. నేనే రెడీ.. మరో ఇద్దరు ఐఏఎస్‌లపై సాయిరెడ్డి ఆరోపణలు

SHARE

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు తొత్తులుగా పనిచేస్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్ లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఈసారి మరో ఇద్దరు పేర్లను కూడా బయటపెట్టారాయన.

ఐఏఎస్ అధికారులపై ఆరోపణలు సరికాదంటూ .. ఐఏఎస్‌ల సంఘం అభ్యంతరం తెలిపిననేపథ్యంలో విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు. టీడీపీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే సీఎంవోలో పనిచేస్తున్న సతీష్ చంద్ర, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావులు టీడీపీ కార్యకర్తలకంటే ఉత్సాహంగా పనిచేస్తున్నారని ఆరోపించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు మరో ఇద్దరు ఐఏఎస్‌లు రాజమౌళి, సాయిప్రసాద్‌లపైనా ఆరోపణలు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలు, లంచం సొమ్ము సిద్ధం చేయడంలో ఐపీఎస్ వెంకటేశ్వరరావుతో పాటు ఐఏఎస్‌ల హస్తముందని విజయసాయిరెడ్డి చెప్పారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నిధులను రామసుబ్బారెడ్డితో కలిసి సగం సగం పంచుకోవాల్సిందిగా ఇద్దరు ఐఏఎస్‌ల సమక్షంలోనే చంద్రబాబు పంచాయితీ చేశారని ఆదినారాయణరెడ్డి చెప్పిన వీడియోను కూడా విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.

మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూరిందన్నారు. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి మధ్య చంద్రబాబు పంచాయితీ చేసిన సమయంలో అక్కడున్న ఐఏఎస్‌ ఎవరో కాదని.. సతీష్‌ చంద్రయేనని విజయసాయిరెడ్డి చెప్పారు.

ఇలాంటి వారు ఆల్‌ ఇండియా సర్వీసుల్లో ఉండడానికే వీల్లేదన్నారు. టీడీపీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉన్నానని.. తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని విజయసాయిరెడ్డిచెప్పారు. ఆ ఆధారాలను చూడాలని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు భావిస్తే వాటిని బయటపెట్టేందుకు తాను సిద్ధమని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా తాను ఏమీ మాట్లాడనన్నారు.