Home సినిమా చైతు కోసం సామ్ కథ కూడా వినకుండా ఒప్పేసుకుందట !

చైతు కోసం సామ్ కథ కూడా వినకుండా ఒప్పేసుకుందట !

SHARE

సమంత తన భర్త నాగ చైతన్య అడగగానే కథ కూడా వినకుండా ఓ సినిమాలో నటించేందుకు ఒప్పేసుకుందట. కాగా, ఈ సినిమాలో చైతు, సామ్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాను నిన్ను కోరి సినిమా దర్శకుడు అయిన శివ నిర్మాణ డైరెక్ట్ చేస్తున్నారు. మొదట ఈ సినిమా కథను శివ నిర్మాణ చైతుకి వినిపించాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు సమంతానే బాగా సెట్ అవుతుంది కాబట్టి మీరు ఆమెను ఒప్పించండి అని చైతుని శివ కోరారట.

చైతుకి కూడా ఈ సినిమా కథ నచ్చడంతో వెంటనే సామ్ ను రిక్వెస్ట్ చేశాడట. చైతు నోరు తెరిచి అడిగితె సమంత మాత్రం ఒప్పుకోకుండా ఎలా ఉంటుంది ? చైతు కోసం కనీసం ఈ సినిమా కథ కూడా వినకుండా వినకుండా ఈ సినిమాలో నటించేందుకు ఒప్పేసుకుంది. అయితే ఈ సినిమాలో సామ్ మాత్రమే కాకుండా మరో హీరోయిన్ కూడా నటిస్తుందట. కానీ ఈ సినిమాలో సామ్ పాత్రనే కీలకమట. కాగా, నాగ చైతన్య మరియు సమంతలు ఇప్పుడు వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వారు నటిస్తున్న సినిమాల షూటింగ్ లు పూర్తి అవ్వగానే శివ నిర్వాణ డైరెక్షన్‌లో వీరిద్దరూ కలిసి ఈ సినిమాను చేయన్నునారు.