పవన్ వలన టీడీపీకి నిజంగానే నష్టమా ?

SHARE

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాజకీయ పరిణామాలను ఉద్దేశించి విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన మహా కామేశ్వర పీఠం అధిపతి యద్ధనపూడి అయ్యన్న పంతులు జోస్యం చెప్పారు. ఆయన చెప్పిన జోస్యం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఆయన ఏమి చెప్పారంటే… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కాలసర్పదోషం ఉంది.

రాజకీయాలోకి సినీ నటులు క్రియాశీలకం అవ్వడం వలన అధికార పార్టీకే నష్టం వాటిల్లుతుంది. కొత్త పార్టీలు పెట్టి సినిమా హీరోలు రాజకీయాలలోకి వచ్చినా కూడా… వారు రాజకీయంగా ఎంత యాక్టీవ్ గా ఉన్నా కూడా… వారి వలన ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీల నుండి అధికారం చేజారుతుంది.

అంతే కాకుండా సినిమా హీరోలు రాజకీయాల్లోకి వచ్చినా కూడా వారు సాధించుకునేది ఏమి ఉండదు.. కానీ వారు అధికార పార్టీలో ఉండే వారికీ నష్టం చేస్తారు. దీని వలన మరో పార్టీ అధికారంలోకి వస్తుంది” అని ఆయన జోస్యం చెప్పారు. ఆయన జోస్యం ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంది, కొత్త పార్టీని పెట్టింది కేవలం పవన్ కల్యాణే. అంటే పవన్ వలన టీడీపీ కి మరియు టీఅర్ఎస్ కి నష్టం ఉండబోతుందని ఈ జ్యోతిష్కుడు పరోక్షంగా చెప్పదలిచారన్నమాట.