Home రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని గబ్బుపట్టించే పనిలో ఉన్న టీడీపీ !

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని గబ్బుపట్టించే పనిలో ఉన్న టీడీపీ !

462
SHARE

ఆంధ్రప్రదేశ్ లో ఎలా అయినా బీజేపీ ని గబ్బుపట్టించాలని తెలుగుదేశం పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఓ పక్క టీడీపీ నేతలెవరూ బీజేపీ నేతలపై నోరు జారవద్దు అని చెబుతూనే మరో పక్క బీజేపీని బ్రష్టు పట్టించే పనిలో ఉన్నారు టీడీపీ నేతలు. కేవలం టీడీపీ నేతలు మాత్రమే కాకుండా టీడీపీ వర్గాలు కూడా సోషల్ మీడియాలో ఇదే పనిలో నిమగ్నం అయి ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి మొత్తంగా 3.55 లక్షల కోట్లు రావల్సి ఉండగా… ఇప్పటివరకు రాష్ట్రానికి 12918 కోట్ల రూపాయలు మాత్రమే రావడం జరిగిందని టీడీపీ వర్గాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. కేంద్రం దేనికి ఎంత ఇచ్చారు అనేది వివరిస్తూ కూడా వారి లెక్కలను తెలిపారు. బీజేపీ చేస్తున్న లెక్కల ప్రచారం ఒకలా ఉంటే టీడీపీ చేసే ఈ లెక్కల ప్రచారం మరోలా ఉంది. బీజేపీ చేస్తున్న లెక్కల ప్రచారానికి కౌంటర్ ఇవ్వడానికే టీడీపీ ఈ ప్రచారం చేస్తుంది.