Home రాజకీయాలు టీడీపీ సర్కార్ లో లంచం తీసుకోకపోవడమే నేరం !

టీడీపీ సర్కార్ లో లంచం తీసుకోకపోవడమే నేరం !

474
SHARE

సాధారణంగా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో లంచాలు తీసుకుంటే చాలా పెద్ద నేరం. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత లంచం తీసుకోకపోతే కూడా అంతే పెద్ద నేరం. ప్రజలకున్న అవసరాలని ఆసరాగా మార్చుకొని వారి పనులను పూర్తి చెయ్యడానికి లంచాలు తీసుకుంటూ పెద్ద మొత్తంలోనే సంపాదిస్తున్నారు. ఇక రెవెన్యూ శాఖ‌లో జరిగే పనుల విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ అవినీతి తారా స్ధాయికి చేరుకుంది.

అవినీతి నిరోద‌క శాఖ అధికారులు ఎన్నో సార్లు దాడులు నిర్వ‌హించి ఎంతోమందిని పట్టుకున్నా కూడా అక్కడి ప్రభుత్వ అధికారుల తీరు మాత్రం ఏ మాత్రం మారడం లేదు. ఇక 2014 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అవినీతి బాగా మితిమీరి పోయిందనే చెప్పుకోవాలి. ఏసీబీ ఎంతోమంది అవినీతి తిమింగ‌ళాల‌ను కూడా పట్టుకుంది. అనితికి పాల్పడి వందల కోట్ల ఆస్తులను కూడబెట్టిన వంద‌ల కొద్ది ప్ర‌భుత్వ అధికారుల‌ను ఏసీబీ పట్టుకుంది.

చంద్రబాబు ఎప్పుడూ తన గురించి తాను బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్‌ అని చెప్పుకుంటునే ఉంటాడు.. కానీ ఇప్పుడు ఆయన హయాంలోనే ఇలా పెద్ద ఎత్తున అవినీతి జ‌రుగుతుండ‌టం నిజంగా చాలా దుర‌దృష్ట‌క‌రం. అవినీతిని నిర్ములించడానికి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌న్నీటిని డిజిటలైజేష‌న్ చేసినా కూడా ఎక్కడోకచోట అధికారులు అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు.

అందులోను రాష్ట్ర విభజన జరగడం, అమరావతిని రాజధానిగా ప్రకటించడం, అక్కడ అనేక పరిశ్రమల ఏర్పాటు కోసం భూ సేక‌ర‌ణ‌లు వంటి అనేక కార‌ణాల చేత రెవిన్యూ శాఖ‌ల్లో అక్రమాలకు అసలు అడ్డూ అదుపూ అనేది లేకుండా పోయింది. టీడీపీ కానీ అధికారంలోకి వస్తే అన్ని సక్రమంగా లేకున్నా కూడా కేవలం డబ్బులిస్తే చాలు.. ఇట్టే పని అయిపోతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎలా ఉందంటే అవినీతికి పుట్టినిల్లుగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని అవినీతిపై తగిన చర్యలు తీసుకుంటేనే టీడీపీకి మంచిది.