Home రాజకీయాలు దళిత బంధుత్వంపై జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

దళిత బంధుత్వంపై జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

SHARE

పాదయాత్రలో వైఎస్ జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాలో సాగుతున్న పాదయాత్రలో కొందరు దళితులు జగన్‌ వద్దకు వచ్చారు. కొన్ని ప్రత్యేక హామీలను కోరారు.

అందుకు స్పందించిన జగన్‌.. తాను తన పరిధిలో లేని అంశాలపై తప్పుడు హామీలు ఇవ్వలేనని వివరించారు. తన పరిధిలో ఉన్న ఏ సమస్యపైనైనా స్పందించేందుకు, పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. చంద్రబాబులాగా ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేయలేనని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా దళితులతో తమ కుటుంబానికి ఉన్న సంబంధాల గురించి జగన్‌ వివరించారు. చంద్రబాబులాగా దళితుల్లో పుట్టకూడదు,… ఆదినారాయణరెడ్డిలాగా ఎస్సీలు స్నానం చేయరు అంటూ దళితులను హేళన చేసే కుటుంబం తమది కాదని చెప్పారు. తన తండ్రి మేనత్తలు వివాహం చేసుకున్నది దళితకుటుంబంలోనే అని వివరించారు.

తన కుటుంబంలో తాను మామ అని పిలిచే వారిలో చాలా మంది దళితులు ఉన్నారని జగన్‌ చెప్పారు. దళితుల పట్ల తమకున్న గౌరవం అది అని జగన్‌ వివరించారు. వైసీపీ అధికారంలోకి రాగానే దళిత సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తన పరిధిలో లేని అంశాలపై మాత్రం తప్పుడు హామీలు ఇచ్చిమోసం చేయలేనని జగన్ సూటిగానే చెప్పారు.