Home సినిమా బాహుబలి-2 తరువాతి స్థానంలో నిలిచిన సినిమా ఇదే !

బాహుబలి-2 తరువాతి స్థానంలో నిలిచిన సినిమా ఇదే !

SHARE

బాహుబలి సినిమా ఎంతటి విజయంను సాధించిందో మన అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఒకరకంగా చెప్పాలంటే బాహుబలి సినిమా దేశమంతా తెలుగు సినిమా వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పింది. ఈ సినిమాలో నటించిన యాక్టర్స్ కూడా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. కాగా, బాహుబలి సినిమా తరువాత అంత పెద్దమొత్తంలో భారీ వసూళ్లను రాబడుతున్న సినిమా ” పద్మావత్ ” అట.

ఈ సినిమాలో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, షాహిద్ కపూర్ లు నటించారు. ఆస్ట్రేలియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి -2 సినిమా తర్వాత 3మిలియన్ డాలర్లను క్రాస్ చేసిన సినిమా పద్మావత్ నేట. ఈ విషయంను పాపులర్ ట్రేడ్ అనలిస్ట్ ఒకరు వెల్లడించారు. ఆయన తన ట్విట్టర్ లో బాహుబలి-2, పద్మావత్ సినిమాల కలెక్షన్స్‌ను వెల్లడించారు.

33లక్షల 50,372 ఆస్ట్రేలియన్ డాలర్స్‌ను బాహుబలి-2 సినిమా రాబట్టగా….. పద్మావత్ సినిమానేమో 30లక్షల 92,553 డాలర్లను రాబట్టి రెండవ స్థానంలో నిలిచింది. మొదట పద్మావత్ సినిమాను విడుదల చెయ్యడానికి వీల్లేదంటూ చాలామంది చాలా చోట్ల పలు ఆందోళనలకు దిగిన సంగతి మనకి తెలిసిందే. కానీ ఈ సినిమా విడుదల అయి ఇంతటి స్థాయిలోవసూళ్లను రాబట్టడం మాములు విశేషం కాదు.