Home రాజకీయాలు అసలు ఉమ్మడిపోరు అంటే ఏమిటో అనేది కూడా చెప్పండి గంట గారు !

అసలు ఉమ్మడిపోరు అంటే ఏమిటో అనేది కూడా చెప్పండి గంట గారు !

262
SHARE

ఇన్ని రోజులకి తెలుగుదేశం పార్టీ మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ మంచి మాట చెప్పారు. తెలిసి చెప్పారో లేక తెలియక చెప్పారో అనేది తెలియదు కానీ ఇన్నాళ్లకీ సొంత ప్రయోజనాల గురించి కాకుండా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలను సాధించాలంటే అన్ని పార్టీలు కలిసి ఉమ్మడిగా పోరాడాలి అని అన్నారు.

అంతా బాగానే ఉంది కానీ, అసలు ఉమ్మడి పోరు అంటే ఏమిటి ? తెలుగుదేశం పార్టీ వారి చేతిలో అధికారం ఉంది కాబట్టి… అందులోను తెలుగుదేశం పార్టీ అధినేతకు నలభయ్యేళ్ల అనుభవం ఉంది కాబట్టి ఆయన ఏమి చేసిన, ఆయన ఏమి చెప్పినా అదే అందరూ ఒప్పుకోవాలని అనుకోవడం ఉమ్మడి పోరాటం అని అనిపించుకోదు. చంద్రబాబు అఖిలపక్షం పెట్టాలని ఆలోచించి దానిని ఇప్పటి వరకు కార్యరూపంలో పెట్టలేకపోతున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు.

అసలు ఉమ్మడి పోరాటం అంటే అన్ని పార్టీలను ఆహ్వానించి…. వాటిలో మెజారిటీ పార్టీలు ఏ అభిప్రాయాన్ని అయితే ఒప్పుకుంటారో దానిని అనుసరించడమే ఉమ్మడిపోరాటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, వైసీపీ , లోక్ సత్తా, వామపక్షాలు అందరూ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే అంటున్నారు. ఒక్క టీడీపీ మాత్రం నిన్నటి వరకు ప్యాకేజీ అని, ఈరోజు ఇంకో గతి లేక ప్రత్యేకహోదా అని అంటున్నారు.