Home రాజకీయాలు చంద్రబాబుని ఇరకాటంలో పెట్టిన జగన్ !

చంద్రబాబుని ఇరకాటంలో పెట్టిన జగన్ !

667
SHARE

గత వారం రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎవరూ ఊహించని విధంగా తయారయ్యాయి. అందుకు కారణం బడ్జెట్ విషయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్యాయమే. ఎన్నో ఏళ్లుగా బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న టీడీపీ కూడా దీనిపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కింది. కానీ కేంద్రంపై ఎలాంటి ఒత్తిడిని తీసుకు రాలేదు.

దీనినే టార్గెట్ గా చేసుకున్న ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల బాగు కోసం, అలాగే ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా వినిపించడం కోసం తన వంతు పోరాటంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించడానికి కూడా సిద్ధమయ్యారు. కానీ, జగన్ వద్ద కేంద్రం తో పోరాడే అంత బలం లేదు. ఎందుకంటె 2014 ఎన్నికల్లో కేవలం 9 మంది ఎంపీలను మాత్రమే గెలుచుకున్నాడు కాబట్టి. మరల అందులో కూడా టీడీపీ నలుగురు ఎంపీలు టీడీపీ ఆకర్షితులయ్యారు. అంటే ఇప్పుడు జగన్ వద్ద కేవలం ఐదుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు.

ఆ ఐదుగురు రాజీనామాలు చేయడం వలన కేంద్రంలో మోడీకి నష్టమేమి లేదు. పైగా, గతంలో వీరి మద్దతు కూడా బీజేపీకి లేదు. అందుకోసమే జగన్ తెలివిగా మాతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలనీ కోరారు. ఒక విధంగా జగన్ ఇలా మాట్లాడి చంద్రబాబుని ఇరకాటంలో పెట్టాడనే చెప్పుకోవాలి.