Home రాజకీయాలు బాబు గారికి ఇప్పుడు జ్ఞానోదయం అయినట్లుంది !

బాబు గారికి ఇప్పుడు జ్ఞానోదయం అయినట్లుంది !

207
SHARE

మొన్నటి వరకు ప్యాకేజీ.. ప్యాకేజీ.. అంటూ కలవరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్నటికి నిన్న ఏదో కళ వచ్చినట్లు మరుసటి రోజు ఉదయానికి మాట మార్చేశారు. ప్యాకేజీ ముద్దు అన్న నోటితోనే ఇప్పుడు ప్యాకేజీ వద్దు హోదా కావాలి అని అంటున్నారు. హోదా కావాలంటూ గత నాలుగేళ్ళ నుండి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అంటుంటే… జగన్ చట్టాల గురించి తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడని చంద్రబాబు జగన్ పై తెగ చిరాకుపడ్డారు.
మరి చివరికి చంద్రబాబు చేసేదేంటి ? చివరికి ప్రతిపక్షంతో కలిసిపోయి ప్రత్యేకహోదా అంటూ కొత్త పల్లవిని అందుకున్నారు. ఇక టీడీపీ నేతలకు మరియు మంత్రులకు టీడీపీ అధినేత చంద్రబాబు ఏదంటే దానికి వత్తాసు పలకడం వెన్నతో పెట్టిన విద్య. అందుకే వారు కూడా ఒక్కసారిగా వారి వారి రంగులను మార్చుకొని ఇప్పుడు హోదా.. హోదా.. అంటూ నినాదాలు చేస్తున్నారు.

అయితే వీరంతా ఒక్కసారిగా ఇలా ఎందుకు మారిపోయారు ? మొన్నటి వరకు ” ప్యాకేజీ ” మైండ్ సెట్ తో ఉన్న వీరంతా ఇప్పుడు ఒక్కసారిగా హోదా.. హోదా.. అని అనడానికి కారణం ఏంటి ? అంటే దీనికి సమాధానం చాలా సులభమైనదే. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సెంటిమెంట్ మొత్తంను వారి వైపు తిప్పుకోవడానికి. ఇందుకోసం ఇప్పుడు హోదాకు మించిన మరే దారి లేదు.

వైసీపీ గత నాలుగేళ్ళ నుండి ప్రత్యేక హోదా అంటూ పోరాడుతుంటే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం మాత్రం ఇప్పటికిప్పుడు మాట మార్చి సెంటిమెంట్ కోసం ఇలా చేస్తుంది. జగన్ వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారనే విషయంను తన “డిటెక్టివ్ నివేదికల” ఆధారంగా తెలుసుకున్న బాబు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడడంతో అవకాశం చూసుకొని ఇలా యూ-టర్న్ తీసేసుకున్నారు. ప్రజలు ఈ విషయాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నారు.