Home రాజకీయాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోసం కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తుందా ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోసం కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తుందా ?

SHARE

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి పాపం ముటగ‌ట్టుకున్నందుకేమో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయడం కోసం ఓ సంచలన నిర్ణయంను తీసుకోనుంది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో మరల పురుడు పోసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇదే సరైన సమయం అని అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఓ సంచలన నిర్ణయంను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏప్రిల్ 6 వ తేదీ లోపు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోతే తమ పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని ప్రకటించారు. మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు మిత్రపక్షం అయినా కూడా విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను నెర‌వేర్చాలంటూ డిమాండ్ చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమో రాజీనామాలు చెయ్యడం కాదు మీకు చేతనైతే కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టండి అంటూ వైసీపీ కి పిలుపునిచ్చారు.

ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు బీజేపీ పై యుద్ధం చేసేందుకు రెడీ అవుతున్నారు. దీనితో ఈ అవకాశాన్ని ఎలా అయినా స‌ద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని విధాలుగా సిద్ద‌మ‌వుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం మీద ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దీనికోసం పార్టీ అధిష్టానంతో సంప్ర‌దింపులు కూడా జ‌రుపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతమున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ కానీ అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ మ‌ద్ద‌తు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే కానీ జరిగితే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మరల పురుడు పోసుకునే అవ‌కాశం ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితులలో అసలు లేరు. నమ్మించి మోసం చేసిన బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే నయం అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు. దీనితో కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఓ అధికారిక ప్రకటన చేయనున్నారు.