Home రాజకీయాలు చంద్రబాబు మద్దతివ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు !

చంద్రబాబు మద్దతివ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు !

SHARE

వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత ,మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవ్వడం మనకు ఎంతో దురదృష్టకరమని అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను మరచిపోయి, వాటిని పక్కన బెట్టి తన సొంత ప్రయోజనాల కోసం కేంద్రంతో లాలూచి పడ్డారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికలు ముందు రాష్ట్రానికి 15 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలని చెప్పి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తన సొంత ప్రయోజనాల కోసం హోదాని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని అన్నారు.

గడిచిన ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున 9 మంది ఎంపీలు గెలవగా… చంద్రబాబు వారిలో నలుగురు ఎంపీలను పదవి ఆశ చూయించి, డబ్బు ఆశ చూయించి వారిని కొనుగోలు చేశారని అన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలా చేయడమేంటి అని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఎంపీలతో కలిసి వస్తే.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించినా కూడా.. చంద్రబాబు జగన్ కు మద్దతు తెలిపేందుకు ఇంకా ముందుకు రాకపోవడం మన దురదృష్టకరమని అన్నారు.

కేంద్రం దృష్టికి సమస్యలను తీసుకెళ్లడానికి ఓ అఖిపక్షంను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉన్నా కూడా… చంద్రబాబు అఖిపక్షంను ఇప్పుడు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఓ పక్క బీజేపీ మంత్రులు తాము రాజీనామా చేస్తామని ప్రకటిస్తుంటే… మరో పక్క చంద్రబాబు మాత్రం కేంద్రంలో మా మంత్రులు రాజీనామా ఏమి చేయరు అని అంటూన్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాబుపై మండిపడ్డారు.