Home సినిమా డైరెక్టర్ తో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా !

డైరెక్టర్ తో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా !

201
SHARE

హీరోయిన్ రాశీ ఖన్నా ఫిబ్రవరి 18న తన పుట్టిన రోజును చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాశీ ఖన్నా తనపై వచ్చిన ఓ గాసిప్‌ కి కూడా క్లారిటీ ఇచ్చేసింది. రాశీ ఖన్నా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుప్రీమ్ సినిమాలో నటించిన సంగతి మనకి తెలిసిందే. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా ఓ సాంగ్‌లో నటించింది.

సుప్రీమ్ సినిమా తరువాత రాశీ ఖన్నా కు మరియు అనిల్ రావిపూడి ల మధ్య ఎఫైర్ నడుస్తుందనే గాసిప్స్ వినిపించాయి. అనిల్ రావిపూడి తో తనకు వచ్చిన ఈ రూమర్ ని రాశీ ఖన్నా ఖండిస్తూ.. అనిల్ రావిపూడి నాకు కేవలం స్నేహితుడు మాత్రమే అని చెప్పి ఆ గాసిప్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. “అనిల్ రావిపూడి సుప్రీమ్ సినిమా తరువాతి నుండి నాకు మంచి ఫ్రెండ్. రవితేజ గారితో బెంగాల్ టైగర్ సినిమాలో నటించాను.

ఆ సినిమా తరువాతి నుండి రవితేజ గారితో స్నేహంగా ఉంటాను. వారిద్దరి కోసమే రాజా ది గ్రేట్ సినిమాలో ఓ సాంగ్ లో కనిపించాను. అంతే… మీరు అనుకుంటున్నట్లు మా మధ్య ఎటువంటి ఎఫైర్స్ లేవు. ఇలాంటివి పుట్టించేది ఎవరో కానీ.. పుట్టించేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఏది పడితే అది రాయొద్దు. నాకు ఏది తప్పో.. ఏది ఒప్పో అని తెలుసుకునే జ్ఞానం ఉన్నప్పుడు ఇలా తప్పేందుకు చేస్తాను ” అని రాశీ ఖన్నా ఈ గాసిప్స్‌పై ఓ క్లారిటీని ఇచ్చేసింది.