Home రాజకీయాలు పవన్ కు చంద్రబాబును ఆ మాట అనే ధైర్యం లేదా !

పవన్ కు చంద్రబాబును ఆ మాట అనే ధైర్యం లేదా !

289
SHARE

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టరు? ఎప్పటి నుండో రాజకీయాలలో ఉంటున్నారు కదా .. ఆ మాత్రం కూడా తెలియదా ? అంటూ వైసీపీకి, టీడీపీ రెండిటికీ ఈ ప్రశ్నను సంధించేశాడు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ తెలిసి మాట్లాడతారో లేక ఏదోకటి మాట్లాడాలి కాదా అన్నట్లు మాట్లాడతారేమో తెలియదు కానీ, పాపం.. పవన్ కు లోక్ సభలో మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి, దానిని ఎలా పెట్టాలో అనేది తెలియదనుకుంటా.

అయినా పవన్ కళ్యాణ్ ఇంతవరకు పార్లమెంటేరియన్ కాదు కదా అందుకే ఈ విషయం గురించి తెలియదేమో. తెలియనప్పుడు తెలుసుకొని మాట్లాడాలి లేదా మౌనంగా ఉండాలి కానీ ఇలా తెలిసి తెలియకుండా మాట్లాడితే ఎలా ? పవన్ కల్యాణ్ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడమే చిత్తశుద్ధి అని అనుకుంటున్నాడు కానీ అక్కడొక విషయమును పవన్ మరచిపోయాడు. అదేమిటంటే ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వమే భాగస్వామిగా ఉంది.. చెప్పాలంటే ఇంకా అలానే కొనసాగుతూ ఉందనే విషయంను పవన్ మరచిపోయాడు.

ఇక పవన్ అన్న అవిశ్వాస తీర్మానం విషయం గురించి పక్కన పెడితే.. పవన్ కల్యాణ్ ధైర్యం చేసి చంద్రబాబును ఒక ప్రశ్న వేయలేకపోయారు. టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు రావాలనే ప్రశ్నను పవన్.. బాబుని అడగలేకపోయారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావాలని పవన్ చంద్రబాబుని గట్టిగా ఒక మాట అనలేకపోయాడు. పవన్ ఆ మాట అని ఉంటే బాగుండేది.

బహుశా.. పవన్ ఆ మాట అనడానికి భయపడి ఉంటాడేమో.. అందుకే పవన్ బాబుని ఆ మాట అడిగి ఉండడు. పవన్ ఎంపీల రాజీనామాతో రాష్ట్రానికి ఒరిగేది లేదంటూ మరో తీర్పును ఇచ్చాడు. ఒకప్పుడు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైనా రాజీనామా చేస్తే వారిని నేనే గెలిపిస్తా అని చెప్పిన పవన్.. ఇప్పుడు రాజీనామాలతో రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమి లేదని అంటున్నాడు. ఎందుకంటె వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయడానికి ముందున్నారు కాబట్టే పవన్ ఇప్పుడు రాజీనామాల వలన ప్రయోజనం లేదని అంటున్నాడు. అదేమిటో రాష్ట్రం కోసం వైసీపీ ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ దానిని అసలు సమర్ధించడు. తెలుగుదేశం ఏమి చేసినా, ఎంతటి అవినీతికి పాల్పడినా దానిని మాత్రం ప్రశ్నించడు. అలాంటప్పుడు ప్రశ్నించడం కోసమే పార్టీ అని ప్రచారం చేసుకోవడం ఎందుకో ?