Home రాజకీయాలు రాజీనామాకు సిద్దమైన మరో జంపింగ్ ఎమ్మెల్యే

రాజీనామాకు సిద్దమైన మరో జంపింగ్ ఎమ్మెల్యే

3265
SHARE

చంద్రబాబు విసిరిన కోట్లకు కక్కుర్తిపడి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కక్కలేక.. మింగలేక బతుకుతున్నారు. చంద్రబాబు ఇచ్చినకోట్లతో సరిపెట్టుకుని.. వారివారి రాజకీయ జీవితాలకు చరమగీతం పాడేసుకున్నట్టుగా వారి పరిస్థితి ఉంది.

ఫిరాయింపుదారుల్లో ప్రస్ట్రేషన్‌ ఏ స్థాయిలో ఉందంటే కోడుమూరుఎమ్మెల్యే మణిగాంధీ ఏకంగా మీడియా ముందే తాను అమ్ముడుపోయిన ఎమ్మెల్యేను అని ప్రకటించుకునేంతగా!. అమ్ముడుపోయి రాజకీయ జీవితాన్ని నాశనంచేసుకున్నారని మణిగాంధీ గగ్గోలు పెడుతున్నారు. ఇదే క్రమంలో ఆయన మిగిలిన ఫిరాయింపుదారుల పరిస్థితిని కూడా వివరించారు.

వారి పరిస్థితి కూడా ఏమంత బాగోలేదన్నారు. త్వరలోనే బద్వేలు ఫిరాయింపు ఎమ్మెల్యే జయరాములు ఏకంగా టీడీపీకి రాజీనామా చేస్తారని మణిగాంధీ వివరించారు. బద్వేలులో స్థానిక టీడీపీ నాయకురాలు విజయమ్మ వర్గం దెబ్బకు ఫిరాయింపు ఎమ్మెల్యే జయరాములు అల్లాడిపోతున్నారు.

కనీసం సిమెంట్ రోడ్డు కాంట్రాక్టు కూడా సాధించుకోలేని దుస్థితిలో జయరాములు ఉన్నారు. ఈ మధ్య మీడియా సమావేశం కూడా పెట్టి తాను టీడీపీ సభ్యుడిని కాదా అని ప్రశ్నించారు. నమ్మి వస్తే ఇంతలా అవమానిస్తారా అని ఆవేదన చెందారు.

ఇప్పుడు మణిగాంధీ కూడా అదే తరహా ఆవేదన కనబరిచారు. జయరాములు రాజీనామా చేస్తారని మణిగాంధీ చెప్పడం ద్వారా ద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా తమ బాధను నిత్యం పంచుకుంటున్నట్టుగానే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోవడం ఖాయమని కూడా మణిగాంధీ చెప్పడం విశేషం.